ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు బుల్లితెరపై వ్యాఖ్యాతగా నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా షోలకు మంచి టిఆర్పి రేటింగ్ కూడా సాధించి పెడుతున్నారు.. ఇక ఇదే బాటలో ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఈయన ఈ షో లో తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నప్పటికీ టిఆర్పి రేటింగ్ మాత్రం సాధించలేక పోతున్నాడు.. ఇక ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్లను , హీరోలను అలాగే దర్శకులను తన షో కి గెస్ట్ లుగా పిలిపించి మరీ షో యొక్క టిఆర్పి రేటింగ్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇప్పటికే ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ హీరోయిన్ సమంత కూడా వచ్చి ఈ షో లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఇప్పుడు మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఈ షో లో గెస్ట్ లుగా హాజరు పరచడానికి సిద్ధమవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఎస్.ఎస్.థమన్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు ఈ షో కి హాజరు కాబోతున్నారు. సాధారణంగా ఒకరిని బుల్లితెరపై చూడడానికి రెండు కళ్లు చాలవు అలాంటిది ఇద్దరూ ఒకేసారి సందడి చేయడానికి వస్తే ఖచ్చితంగా ఈ షో మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తుంది అని పలువురు  ఇండస్ట్రీ వర్గాల వారు తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

ఇకపోతే ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లతో ఎన్టీఆర్ ఎలా సందడి చేస్తాడో చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ తో కలిసి ఎలా ఆడతారు అనే విషయం తెలుసుకోవడం కోసం బుల్లితెర అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: