తాజాగా ప్రముఖ ఛానల్ జీ తెలుగు లో ప్రారంభమైన రౌడీ గారి పెళ్ళాం సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.. ఇక ఇందులో హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న శివ అసలు పేరు ఆదర్శ్.. ఈయన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించారు. మొదటిసారి నీవల్లే నీవల్లే అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన ఆదర్శ్ , ఆ తర్వాత రౌడీ గారి పెళ్ళాం అనే సీరియల్లో రౌడీ పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ఈ సీరియల్ కాన్సెప్ట్ విషయానికి వస్తే, పొలిటిషన్ దగ్గర రౌడీగా ఉండే ఒక వ్యక్తిని ఆయన భార్య ఎలా మార్చింది అన్న కాన్సెప్ట్ తోనే ఈ సీరియల్ తీయడం జరుగుతోంది..
ఇక ఆదర్శ్ రియల్ లైఫ్ స్టోరీ గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే బెంగళూరులో జన్మించిన ఆదర్శ్,  ఇక తన విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశాడు.. బీటెక్ లో ఈసీఈ పూర్తి చేసిన ఆదర్శ్,  3 సంవత్సరాలపాటు టెక్ మహీంద్రా కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేశాడు.. ఆయనకు తను చేస్తున్న ఉద్యోగంలో ఆసక్తి లేకపోవడం కారణంగా నటన మీద ఎక్కువ మక్కువ పెంచుకున్నాడు.. చూడడానికి మంచి కటౌట్  ఉండడంతో ఈయన కొలీగ్స్ అందరూ హీరోగా ట్రై చేయమని చెప్పారట..
అలా ఆదర్శ్ కన్నడ సినీ ఇండస్ట్రీ లోకి రావడం కోసం తన జాబ్ మానేసి మరి షార్ట్ ఫిలిమ్స్ , మూవీస్ లో నటించడం మొదలు పెట్టాడు.. అక్కడ తన నటనతో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఆదర్శ్, ఆ తర్వాత సీరియల్స్ లో ప్రవేశించాడు.. పలు వెబ్ సిరీస్లు అయిన డాక్టర్ ఐయామ్ ప్రెగ్నెంట్ , విద్యా వినాయక, చిత్ర కథ వంటి వెబ్ సిరీస్ లో కూడా ఆదర్శ్ నటించాడు..ఈయనకు  వివాహం కూడా జరిగింది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న రౌడీగారి పెళ్ళాం అనే సీరియల్ లో హీరోగా తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: