ప్రేమ్ అసలు పేరు నిఖిల్ నాయర్.. డిసెంబర్ 16వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు జిల్లా లో జన్మించాడు. నిఖిల్ కర్ణాటకకు చెందిన అబ్బాయి కాబట్టి తన విద్యాభ్యాసం అంతా బెంగళూరులోని పూర్తి చేశాడు. నిఖిల్ కు ఒక బ్రదర్ కూడా ఉన్నారు.. నిఖిల్ నాయర్ యొక్క విద్యాభ్యాసం విషయానికి వస్తే, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశారు నిఖిల్. సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఈయన దాదాపు ఐదు సంవత్సరాల పాటు సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసి, ఆ తరువాత నటన మీద ఆసక్తి ని పెంచుకున్నాడు.
నిఖిల్ బాల్యంనుంచి మోడలింగ్ రంగం అన్న.. నటనా రంగం అన్న చాలా ఇష్టమట.. ఇక అందులో భాగంగానే కళాశాలలో జరిగే ఫ్యాషన్ ఈవెంట్స్లో ఎప్పుడు నిఖిల్ పాల్గొనడమే కాకుండా తప్పకుండా మొదటి స్థానం కైవసం చేసుకునేవారు. మోడల్ గా కూడా చేశారు. మోడల్ గా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. అంతేకాదు నిఖిల్ పలు వాణిజ్య ప్రకటనల్లోనూ, యాడ్స్ లోనూ నటించారు..ఇక మొదటిసారిగా తెలుగు బుల్లి తెరకు పరిచయం కావడం గమనార్హం. మొదటి సీరియల్ తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అవడమే కాకుండా మరి కొన్ని సీరియల్స్ లో అవకాశాలను పొందుతున్నాడు. ప్రస్తుతము మలయాళంలో కూడా నటిస్తున్నాడు నిఖిల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి