నిన్న రాత్రి బిగ్ బాస్ షో లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరిగింది. అందు భాగంగా బిగ్ బాస్ అందరికీ తలో ఒక్క బేబీని అందించారు. అయితే ఇంటి సభ్యుల పని అంతా ఆ బేబీని తదుపరి బిగ్ బాస్ నుండి ఆదేశం వచ్చే వరకు బాగా చూసుకోవడమే. మధ్య మధ్యలో బజర్ మోగిన సమయంలో బయట ఆల్రెడీ ఉంచిన అయిదు బేబీ చైర్ లలో బేబీ లను మొదట ఉంచిన అయిదు మంది తర్వాత రౌండ్ కు వెళ్తారు. అయితే ఈ టాస్క్ మొదలైన కొంచెం సమయం వరకు గీతు ను బిగ్ బాస్ ఆటాడుకున్నాడు. తన దగ్గరున్న పాపను పదే పదే ఏడిపిస్తూ డైపర్లు మార్పించాడు. అయితే ఈ పని చేయడానికి గీతు మాత్రం అంత ఇష్టంగా లేదు.

ఇక మొదట బయట ఉన్న చైర్ లలో బేబీ లను ఉంచిన అయిదు మందికి బిగ్ బాస్ "శాక్ టాస్క్" ఇచ్చాడు. ఇందులో బాగా ఆడుతున్న రేవంత్ చివరగా ఫైమా కారణంగా గెలవలేకపోయాడు. దీనితో ఆ టాస్క్ లో రాఘవ విన్నర్ అయ్యాడు. ఇక టాస్క్ అయిన వెంటనే తమ బేబీ లను చూసుకోవలసిన బాధ్యత ఇంటి సభ్యులదే... కానీ రేవంత్ టాస్క్ లో ఓడిపోయానని బాధలో ఉన్నాడు. ఈ విషయంపై  కొంచెం ఫైమా మరియు రేవంత్ ల మధ్య చర్చ కూడా జరిగింది. దీనితో హర్ట్ అయిన రేవంత్ తన బేబీ ని బయట బిగ్ బాస్ ఉంచిన బేబీ చైర్ లో తన బేబీ ని ఉంచాడు. ఆ ప్లేస్ లో ఉంచితే ఇక టాస్క్ నుండి తొలగినట్లే.

అంటే ఈ వారం కెప్టెన్ అయ్యే అర్హతను రేవంత్ కోల్పోయాడు. ఇక రెవంత్ మెరీనా మరియు రోహిత్ ల దగ్గర కూర్చుని బేబీ గురించి బాగా ఎమోషనల్ అయిపోయాడు. నేను ఈ రోజు రాత్రి బేబీ ని నాతో పడుకోబెట్టుకోవాలనుకున్నానని చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇందుకు మెరీనా రోహిత్ లు ఇంకో మూడు నెలల్లో నీకు బేబీ వస్తుంది కదా అంటూ ఓదార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: