తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ఫైమా కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదట పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతరత్రా ఈవెంట్లకు సైతం ఎంట్రీ ఇస్తూ తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకుంది.. ముఖ్యంగా ఫైమా కామెడీ టైమింగ్ కి సైతం యూత్ లో భారీగానే ఏర్పడింది.. కొన్ని కామెడీ స్కిట్లు ఇమే వల్లే నడిచాయని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు.. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బిగ్ బాస్ కంటిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది.

అయినప్పటికీ కూడా విన్నర్ కాలేకపోయింది పైమా. దింతో తిరిగి మళ్లీ మాటీవీలో ప్రసారమయ్యే పలు కామెడీ షో లలో చేసినప్పటికీ..తిరిగి మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేసిన ఫైమా స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవి. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.. ఇదంతా ఇలా ఉండగా తాజా ఫైమా చేసిన కొన్ని వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


అసలు విషయంలోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన ఫోటోలని రీల్స్ ని అప్లోడ్ చేసే పైమా.. తాజాగా సోషల్ మీడియాలో అస్క్ మీ క్వశ్చన్ వంటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక అభిమాని ఒక్కొక్క లాగా పలు ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటికి సమాధానాలను ఇచ్చింది పైమా.. న్యూ ఇయర్ స్పెషల్ ఎలా ప్లాన్ చేశారని అడగగా పెద్దగా ఎలాంటి అవసరం లేదు కచ్చితంగా ఏదో ఒక ఈవెంట్ ఉంటుందంటూ రిప్లై ఇచ్చింది.. హీరోయిన్ అవ్వాలని అనుకున్నారా ఎప్పుడైనా అని మరొకరు అడగగా.. ఫ్రెండ్ క్యారెక్టర్ అతిధి పాత్ర సైడ్ క్యారెక్టర్ ఇలా ఏవో ఒకటి రెండు నిమిషాలు వచ్చి వెళ్లే పాత్రలు చేయాలనుకోలేదని లైఫ్ లాంగ్ ఏదైనా పాత్ర గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నానని తెలిపింది పైమా. అవకాశం వస్తే హీరోయిన్గా చేయాలని కోరిక ఉందంటూ తెలిపింది పైమా.

మరింత సమాచారం తెలుసుకోండి: