తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీగా పేరుపొందింది నటి శోభా శెట్టి.. తెలుగులో సీరియల్స్ లో కూడా నటించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ముఖ్యంగా స్టార్ మాలో ప్రసారమయ్యేటువంటి కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. ఇదే క్రేజీతో ఇటీవలే బిగ్ బాస్ -7 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న శోభా శెట్టి 14 వారాల పాటు హౌస్ లో కొనసాగింది. ఈ క్రమంలోని ఆమె పైన చాలా దారుణమైన ట్రోల్స్ కూడా వినిపించాయి వెంటనే ఎలిమినేట్ చేయడం కూడా జరిగింది.


హౌస్ లో మోనితా లాగే ఉందని విమర్శలు కూడా వినిపించాయి. హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేమలో ఉన్న విషయాన్ని తెలియజేయడంతో పాటు తన బాయ్ ఫ్రెండ్ పేరును కూడా తెలియజేయడం జరిగింది. శోభ శెట్టి కోసం తన బాయ్ ఫ్రెండ్ హౌస్ కి కూడా రావడం జరిగింది.ఆమెని సర్ప్రైజ్ చేశారు.అయితే శోభా శెట్టి బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు కార్తీకదీపం సీరియల్ లో నటించిన డాక్టర్ బాబు సోదరుడు యశ్వంత్.. చాలాకాలంగా ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని సమాచారం.


ఈ విషయాన్ని శోభా శెట్టి తెలియజేసింది. ఇదంతా ఇలా ఉండగా శ్రీముఖి షోలో సడన్ సర్ప్రైజ్ చేస్తూ ఒక ట్రీట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఆదివారం స్టార్ మా  పరివార్ నడుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు సీరియల్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ లాగా ఈ షో ని కొనసాగించారు ఇందులో ప్రియాంక, అర్జున్, అమర్ దిప్ వంటి వారు పాల్గొన్నారు. ఇందులో శోభా శెట్టి కూడా ఎంట్రీ ఇవ్వడంతో శ్రీముఖి ఈమె కళ్ళకు గంతలు కట్టి తన ప్రియుడు యశ్వంత్ ని తీసుకువచ్చి ఆమె ముందు నిలబెట్టి సడన్ సర్ప్రైజ్ చేసింది. అలా ఇద్దరు కూడా ప్రపోజ్ చేసుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: