చాలామంది సెలబ్రిటీలు అవకాశాలు లేక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది బిగ్ బాస్ నుంచి రాగానే భారీ గానే అవకాశాలు అందుకున్న వారు చాలా మంది ఉన్నారు.. తాజాగా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన పూజా రామచంద్రన్ సక్సెస్ కాలేక పోయింది.. స్వామి రారా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత అడపా దడపా చిత్రాలలో కనిపించింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా కంటిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది.


అక్కడ కూడా హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. పూజ రామచంద్రన్ సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేవలం సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది. ఈమె భర్త కూడా టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించారు. ఈమె భర్త పేరు జాన్ కొక్కెన్ .. ఈ విలన్ భార్య హీరోయిన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరూ వెకేషన్ కి వెళ్ళారంటే చాలు అక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని నానా హంగామా చేస్తూ ఉంటారు.


గతంలో కాస్త బరువు పెరిగినప్పటికీ ఈ ముద్దుగుమ్మ.. 2021 తర్వాత హీరోయిన్గా పూర్తిగా సినిమాలకు దూరమైంది.జాన్  కొక్కెన్ కంటే ముందే పూజ రామచంద్రన్ వీజె క్రేయిగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఏడేళ్లపాటు కాపురం కూడా చేసిందట. ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయింది. యంగ్ హీరోయిన్లకు దీటుగా తన అంద చందాలతో సోషల్ మీడియాని హీటెక్కిస్తూ ఉంటుంది. నిరంతరం తన భర్తతో కలిసి రొమాంటిక్గా తీసుకున్నటువంటి ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటుంది పూజ రామచంద్రన్. తాజాగా వీరిద్దరికీ సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: