మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే చాలు చాలా మంది సెలబ్రిటీల సైతం టక్కున ఒప్పుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా బుల్లితెర పైన ప్రముఖ యాంకర్ గా పేరు పొందిన శ్రీముఖి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అందం, అభినయంతో పాటు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఒక వెలుగు వెలుగుతోంది. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి కి వచ్చిన పాపులారిటీ గురించి సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు పలు సినిమాలలో కూడా కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉంటుంది.

తాజాగా శ్రీముఖి కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే శ్రీముఖి త్వరలోనే మెగా కాంపౌండ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో అవకాశాన్ని అందించుకుంది. చిరంజీవి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న తాజా చిత్రం  విశ్వంభర ఈ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఒక స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకసారి చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయబోతోంది.


అయితే శ్రీముఖికి అవకాశం రావడానికి ముఖ్య కారణం మెగా కుటుంబంతో ఈమెకు ఉన్న మంచి అనుబంధమే అన్నట్లుగా తెలుస్తోంది. భోళా శంకర్ సినిమా షూటింగ్ సమయంలో మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడిందని ఆ అనుబంధంతోనే ఇప్పుడు చిరంజీవి ఈమెకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో శ్రీముఖి అభిమానులు అయితే కాస్త ఆనందం ని తెలుపుతున్నారు.కానీ మరి చిరంజీవి పక్కన శ్రీముఖి పర్ఫెక్ట్ జోడి అవుతుందా లేదా అనే విషయం పైన కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటివరకు ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం కానీ శ్రీముఖి గానీ స్పందించలేదు.. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.. గతంలో పలు చిత్రాలలో నటించిన శ్రీముఖి ఈమధ్య కాలంలో నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: