
గతంలో ఒకసారి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాను అలా వచ్చిన తర్వాత తనకు యాక్సిడెంట్ అయిందని కారులో వెళుతూ ఉంటే ఒక బర్రె అడ్డు రావడంతో యాక్సిడెంట్ జరిగిందని దీంతో తన నుదుటిమీద సర్జరీ, ముక్కుకి సర్జరీ కూడా జరిగిందని దీంతో కోమాలోకి వెళ్లిపోయానని తెలిపింది తన్మయి. అలా తాను బెడ్ మీద ఉన్నప్పటికీ ఈ విషయం తెలిసి జబర్దస్త్ లో ఉండే వారు ఎవరు కూడా తన బతుకనా చచ్చానా అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఎవరు కూడా హెల్ప్ చేయలేదు.. సపోర్టు కూడా చేయలేదని. కొంతమందిని నోరు తెరిచి అడిగినా కూడా సహాయం చేయలేదని కొంతమంది ఏకంగా మోసమే చేశారని వెల్లడించింది.
అలా కిరాక్ ఆర్పీ తనని మోసం చేశారని ఒకప్పుడు తాను అతనికి సపోర్ట్ చేశాను ఫైనాన్షియల్ గా కూడా సపోర్టుగా నిలబడ్డానని.. అన్న అంటూ తిరిగాను కానీ తనకేమీ చేయలేదు. అదిరింది షో నుంచి అతని వల్లే తాను బయటికి వచ్చేసానని తెలియజేసింది తన్మయి. తన దగ్గర నమ్మకం పోగొట్టుకున్నాడు నేను అతనిని ఎంతో సపోర్టు చేశాను జబర్దస్త్ లో ఉండే వారందరికీ తెలుసు కానీ అతను మాత్రం తనని చివరికి మోసం చేశారంట ఎమోషనల్ గా మాట్లాడింది తన్మయి.. మరి ఈ విషయం పైన కిరాక్ ఆర్పీ ఏ విధంగా క్లారిటీ ఇస్తారు చూడాలి మరి.