
ఈమధ్య ఏఐ టెక్నాలజీని చాలామంది బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. హీరోలు, క్రికెటర్లు, చిన్నపిల్లలు ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా చేస్తూ చాలామంది ఫోటోలను కూడా వైరల్ గా చేస్తున్నారు.ఇప్పుడు తాజాగా జబర్దస్త్ ప్రోమో అని కూడా అలాగే చూపించారు జబర్దస్త్ టీమ్.. ముఖ్యంగా బాహుబలి సినిమా తరహాలో ఈ జబర్దస్త్ స్కిట్ ను చేసినట్లు కనిపిస్తోంది. శివగామిగా (ఖుష్బూ), కృష్ణ భగవాన్ (బిజ్జల దేవుడిగా), కట్టప్ప పాత్రలో (రాకెట్ రాఘవని) చూపించారు.
ప్రోమో విషయానికి వస్తే జబర్దస్త్ రాజ్యంలో ఉన్న ప్రజలకు నమస్కారం.. నా పతి బిజ్జలదేవున్ని పిలుస్తాను ఉండండి అంటూ.. ఏవండీ మన రాజ్యంలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఖుష్బూ అడగగా.. పొద్దున్నే పంచాయతీ మొదలుపెట్టిందంటూ మన రాజ్యంలో అందరూ కూడా బాగానే ఉన్నారు ఆహారానికి డబ్బుకి ఎక్కడ కొదవలేదు ఆనందమే కొంచెం ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు అంటూ కృష్ణ భగవాన్ తెలిపారు.. వెంటనే కట్టప్ప అంటూ ఖుష్బూ అరవగా.. ఆ వెంటనే రాకెట్ రాఘవ చిన్న కుర్రాడిలా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. ఏం కట్టప్ప రావడానికి లేట్ అయింది అని ఖుష్బూ అడగగా.. పెళ్లిచూపులని వెళ్లాను అందుకే ఆలస్యం అయ్యిందంటూ బదిలిస్తారు.. కంటి చూపు మందగించే వయసులో పెళ్లి అవసరమా అంటు కృష్ణ భగవాన్ సెటైర్ వేస్తారు.
ఇక వెంటనే జబర్దస్త్ రాజ్యానికి మకిలి పట్టింది కామెడీతో కడిగేయాలి కట్టప్ప అంటూ ఖుష్బూ డైలాగ్ చెబుతుంది. ఆ వెంటనే ఇక జబర్దస్త్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంట్రీ ఇస్తారు. మొత్తానికి బాహుబలి స్కిట్ తో ఫుల్ కామెడీగా కనిపిస్తోంది జబర్దస్త్ స్కిట్ .. చివరిలో యాంకర్ రష్మీ ని కూడా ఏఐ ను ఉపయోగించినట్లు కనిపిస్తోంది.