టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోలలో సక్సెస్ ఎక్కువగా ఉన్న హీరోగా పేరు సంపాదించారు బాలకృష్ణ. దీంతో బాలయ్యతో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు కూడా మక్కువ చూపుతున్నారు. తాజాగా టాలీవుడ్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ దాదాపుగా ఫైనల్ అయినట్లుగా టాలీవుడ్ లో జోరుగానే ప్రచారం జరుగుతుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హరీష్ శంకర్. కెవిఎన్ ప్రొడక్షన్లో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూర్తి అయిన తర్వాత తన తదుపరి ప్రాజెక్టుని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నట్లు వినికిడి. ఈ సినిమా భారీ మాస్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోంది. ఈ విషయం విన్న బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు. ఎందుకంటే డైరెక్టర్ హరీష్ శంకర్ హీరోలను చూపించే విధానంలో చాలా స్టైలిష్ గా, హై యాక్టివ్ సీన్స్ లతో చూపిస్తుంటారు. ఇక ఈ కాంబినేషన్లో థియేటర్లో సినిమా విడుదల అయ్యిందంటే చాలు అభిమానులు చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.


అయితే ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తారా? లేకపోతే గతంలో డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత నాగవంశీ నిర్మిస్తారా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. గత ఏడాది అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చిన బాలయ్య మిక్స్డ్ టాక్ ని సంపాదించుకున్నారు. అలాగే తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కూడా బిజీగా ఉన్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా నటించబోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా సినిమా మొదలు కాబోతున్నట్లు సమాచారం మరి ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: