తెలుగు బుల్లితెరపై మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి ప్రియాంక జైన్. ఇందులో మూగ అమ్మాయిలా కనిపించి తన సహజమైన నటనతో అందరిని బాగా ఆకట్టుకుంది. అలా తెలుగు సీరియల్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక ఆ తర్వాత జానకి కలగనలేదు అనే సీరియల్ తో మరింత పేరు సంపాదించుకుంది. ఇలా పేరు సంపాదించడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశాలని అందుకుంది. అక్కడ తన గేమ్ తో , మాటలతో టాప్బి5 లో నే సంపాదించుకుంది ప్రియాంక జైన్.


ప్రియాంక జైన్ ప్రముఖ బుల్లితెర యాక్టర్ శివకుమార్ తో కూడా ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికీ ఎన్నో సందర్భాలలో తెలియజేసింది. అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే విధంగా  తెలియజేస్తూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. వీరిద్దరూ కలసి రొమాంటిక్ ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో కొన్నిసార్లు ట్రోల్ కి గురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజగా వీరి ఫోటోలు సోషల్ మీడియాలో మరొకసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


తాజాగా ప్రియాంక జైన్, శివ్ షేర్ చేసిన ఫోటోలు ఈ బుల్లితెర నటి ప్రెగ్నెంట్ గా కనిపిస్తోందని ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావా ప్రియాంక అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటావో దయచేసి చెప్పు ప్రియాంక చూసే వాళ్లకు బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే శివ్ కు గ్రాండ్ పార్టీతో లవ్ ప్రపోజ్ చేసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే అన్ని కుదిరితే ఈ ఏడాది వివాహం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: