తెలుగు బుల్లితెరపై సీనియర్ యాంకర్ గా పేరు పొందిన ఉదయభాను ఈ మధ్య మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె రీఎంట్రీ ఇచ్చే ముందు సినీ ఇండస్ట్రీలో సిండికేట్ యాంకర్లు ఉన్నారనే విషయం మాట్లాడడంతో పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఏవైనా సినిమా ఈవెంట్స్ కానీ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ కేవలం ఒకరిద్దరు యాంకర్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఫంక్షన్ల విషయానికి వస్తే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు , పిఆర్వోలతో చాలా క్లోజ్ గా ఉండే యాంకర్లకు మాత్రమే ఎక్కువగా ఇవ్వడం వల్ల ఉదయభాను లాంటి సీనియర్ యాంకర్లు దూరమవుతున్నారు.

ఉదయభాను ఎలాంటి విషయానైనా సరే ముక్కు సూటిగానే మాట్లాడుతూ ఉంటుంది. గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన ఉదయభాను లీడర్ ,జులాయి వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపించింది. ఇప్పుడు మైథలాజికల్ చిత్రం బార్బిరిక్ అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉదయభాను మళ్ళీ యాంకర్ల సమస్య పైన మరొక సారి మాట్లాడింది. టాలీవుడ్ లో యాంకర్లు సిండికేట్ ఉందనే మాటని తాను కట్టుబడి ఉన్నానంటూ తెలిపింది.

తోటి యాంకర్లను తొక్కేస్తున్నారనే విషయం కూడా నిజమేనని తాను ఎప్పుడూ కూడా నిజాలే మాట్లాడతానని తెలిపింది. కేవలం తాను మాత్రమే కాదు ఏ యాంకర్ కదిలించిన కూడా ఇలాంటి నిజాలు చెబుతారని.. తాను బయటికి చెప్పాను వారు చెప్పలేరు అంతే తేడా అంటూ తెలిపింది.. యాంకర్ గా,యాక్టర్ గా తాను గ్యాప్ తీసుకోలేదు వచ్చింది అంతే అంటూ తెలిపింది. గతంలో స్పెషల్ సాంగ్ లో నటించమంటూ కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి కానీ తాను ఎక్స్పెక్ట్ చేసిన లిరిక్స్ రాకపోవడంతో వదిలేసానని తెలిపింది. కానీ అల్లు అర్జున్ అంటే తన కుటుంబానికి చాలా ఇష్టం ఉండడంతో జులాయి సినిమాలో రెండు స్టెప్పులు వేశానని తెలిపింది. ఇండస్ట్రీలో ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని ఏమీ లేదు అందరూ ఇష్టమే.. నా కులమే ఆర్టిస్టు కులము.. ఇందులో అది ఇది అని ఏది ఉండదు. కులాల పేరు చెప్పుకొని టాలెంట్ ని దూరం చేయడం చాలా మూర్ఖత్వమని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: