సాధార‌ణంగా జ‌ర్నీని చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అయితే దూర ప్రాంతానికి వెళ్లేట‌ప్పుడు.. రైలు ఎక్కడుందో తెలుసుకోవాలని.. బుకింగ్‌ కౌంటర్‌ వద్ద నిలబడకుండానే రైలు టికెట్‌ తీసుకోవాలని ఇలా అనేక ర‌కాల కోరిక‌లు ఉంటాయి. అయితే మీ కోరిక‌లు ఇక నుంచీ నెర‌వేరిన‌ట్టే. రైలు సమయానికి అనుగుణంగానే ఇంటి నుంచి కదిలే వీలుగా, కాగిత రహిత ఫ్లాట్‌ఫాం టికెట్‌ తీసుకునే విధంగా.. ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు తరచూ రైళ్లలో ప్రయాణించే వారైతే ఐఆర్‌సీటీసీ యాప్స్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఉంచుకుంటే బాగుంటుందని అధికారులు కూడా సూచిస్తున్నారు. సమయం వృథా కాకుండా.. నిమిషాల కొద్దీ క్యూలో నిలబడకుండా ఉండేందుకు ఈ యాప్స్ చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌రి అవేంటో ఓ లుక్కేసి.. డౌన్‌లోడ్ చేసి.. ఉప‌యోగించుకోండి.

 

రైల్‌ కనెక్ట్‌ యాప్‌.. 2014 సంవత్సరంలో ఐఆర్‌సీటీసీ 'రైల్‌ కనెక్ట్‌' పేరిట ఐఆర్‌సీటీసీ తన మొదటి యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని 2017లో అప్‌గ్రేడ్‌ చేసింది. టికెట్‌ బుకింగ్‌తోపాటు క్యాన్సిలేషన్‌, తత్కాల్‌ బుకింగ్‌, రైలు ఎక్కే ప్రదేశంలో మార్పువంటి సేవలు కూడా ఈ యాప్‌ ద్వారా పొందే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ ఎయిర్‌ యాప్‌.. తరచూ విహార యాత్రలకు వెళ్లేవారు ఎక్కువగా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ టూరిజం యాప్‌ ద్వారా టూర్‌ ప్యాకేజీలు, హోటళ్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది.  ఇతర సంస్థలతో పోలిస్తే ఈ యాప్‌ ద్వారా చౌకగా జాతీయ, అంతర్జాతీయ టూర్‌ ప్యాకేజీలను బుక్‌ చేసుకోవచ్చు. ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌.. రైలులో వివిధ ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో మీరు కూర్చున్న చోటకు ఆహారం, టిఫిన్లు తెప్పించుకునేందుకు ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. 

 

ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌లో మీ పీఎన్‌ఆర్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే నిమిషాల్లో ఫుడ్‌ వస్తుంది.  వేర్‌ ఈజ్‌ మై ట్రైన్‌.. ‘వేర్‌ ఈజ్‌ మై ట్రైన్‌’ యాప్‌ ద్వారా మనం ఎక్కాల్సిన రైలు స్టేషన్‌కు ఎన్ని గంటలకు వస్తుంది, ప్రస్తుతం ఎక్కడ నడుస్తుంది (లైవ్‌ లోకేషన్‌) అనే వివరాలను తెలుపుతోంది. యూటీఎస్‌ యాప్‌.. ఇండియన్‌ రైల్వేస్‌ సరికొత్తగా విడుదల చేసిన అన్‌ రిజర్వ్‌డ్‌ ట్రైన్‌ టికెట్స్‌ (యూటీఎస్‌) యాప్‌ రైలు టికెట్లను సులువుగా బుక్‌ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మెనూ ఆన్‌ రైల్స్‌.. మెనూ ఆన్‌ రైల్స్‌ అనే యాప్‌ గతేడాది విడుదల చేశారు. ఈ యాప్‌ ద్వారా రైలు ప్రయాణంలో అందించే ఫుడ్‌ ఐటమ్స్‌, వాటి ధరలను తెలుసుకోవచ్చు. భారతీయ రైళ్లలో ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్‌ సేవలు అందుబాటులో ఉన్న రైళ్లలో ఈ మెనూ వివరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: