ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరైనా వారికి ఇష్టమైన వారితో మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఎక్కువ శాతం మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ తరుణంలో వాట్సప్ లో అన్ని సమయాల్లో కూడా  ఎక్కువ శాతం వాట్సాప్ అండ్ వాయిస్ కాల్స్ లో ఉంటున్నారని గమనించడం జరిగింది. 

 


ఇక ఈ తరుణంలో వాట్సాప్ గ్రూప్ కాల్ పరిమితిని నలుగురు కంటే ఎక్కువగా పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఈ ఫీచర్ ఇంకా విడుదల చేయలేదు. ఇందుకోసం వాట్సాప్ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో పాటు వాట్సాప్ లో ఎంత మంది వ్యక్తులు కాల్స్ చేసుకోవచ్చు అన్నదానిపై ఫైనల్ గా ఒక సంఖ్య ఇంకా నిర్ధారణ అవ్వలేదు.  ప్రస్తుతానికి మాత్రం వాట్సాప్ ద్వారా నలుగురు వ్యక్తులతో వాయిస్ మరియు వీడియో కాల్ చేసుకోవచ్చు. ఇక కొత్త టెక్నాలజీతో వాట్సాప్ ఈ ఫీచర్ ను 12 మంది వరకు ఒకేసారి వీడియో వాయిస్ కాల్స్ చేసుకునే విధంగా విస్తరించగలదు అని నిపుణులు తెలియజేస్తున్నారు.

 

 


ఇటీవల గూగుల్ డియో కూడా 12 మంది వరకు గ్రూప్ కాల్స్ పరిమితిని పొడిగించడం జరిగింది. అతి త్వరలోనే ఈ ఫ్యూచర్ ని విడుదల చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మాత్రం ప్రజలు ఎక్కువమందితో  వీడియో కాల్స్ చేయడం కోసం జూమ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అండ్ గూగుల్ మీట్ వంటి ఆప్స్ ను ఉపయోగిస్తున్నారు.  ఇక తాజాగా ఆండ్రాయిడ్ లోని బీటా అప్డేట్ ద్వారా వాట్సాప్ కొత్త కాల్ కూడా జోడించడం జరిగింది. ప్రస్తుతం ప్రతి వాయిస్ లేదా వీడియో కాల్స్ లో "ఎండ్ టూ ఎండ్" అనే ఫ్యూచర్ ని తీసుకొని రావడం జరిగింది. ఇది కేవలం ఆండ్రాయిడ్ లోని వాట్సాప్ బీటా వినియోగదారులకు మాత్రమే అని వాట్సాప్ అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా సరే అతి త్వరలోనే నలుగురి కంటే ఎక్కువమందితో వీడియో వాయిస్ కాల్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది వాట్సాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: