రెడ్ మి మొబైల్స్ ప్రత్యేకతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తక్కువ కాలం లో బాగా ఫేమస్ అయ్యాయి. పండగ సీజన్లలో మరీ ఎక్కువ సేల్స్ ను అందుకున్నాయి. కాగా ఇప్పుడు కొత్తగా రెడ్ మి 10 సిరీస్ మొబైల్స్ సందడి చేస్తున్నాయి.. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను పరిచయం చేసింది షావోమీ. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్‌కు అప్‌గ్రేడ్ వర్షన్స్. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో సూపర్ అమొలెడ్ డిస్‌ప్లేను పరిచయం చేసింది షావోమీ. 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.


షావోమీ ఫోన్ బాక్సులోనే ఫాస్ట్ ఛార్జర్లను అందిస్తోంది. అయితే వీటిని అమెజాన్ తో పాటుగా , ఎంఐ స్టోర్స్, ఎంఐ అధికారిక వెబ్‌సైట్లలో కూడా అందుబాటు లో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. జియోలో రూ.349 కన్నా ఎక్కువ ప్లాన్స్‌పై రూ.10,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.11,999. ఇది 4జీబీ+64జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999. రెడ్‌మీ నోట్ 10 సేల్ మార్చి 16న మొదలుకానుంది.



ఇక రెడ్‌మీ నోట్ 10 ప్రో ధర చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.15,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999. రెడ్‌మీ నోట్ 10 ప్రో సేల్ మార్చి 19న మొదలవుతుంది. రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ధర చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.18,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.19,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మార్చి 18 నుంచి మొదలవుతుంది. ఫీచర్లు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. దీంతో విడుదల కాక ముందే డిమాండ్ కూడా భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: