కరోనా విజృంభించడంతో  దేశ ప్రజలందరూ ముప్పు తిప్పలు పడుతూ, ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న  విషయం అందరికి తెలిసిందే . మరోవైపు ఈ దాడికి తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంతేకాకుండా దేశంలో రోజురోజుకు ఆక్సిజన్ సరిగ్గా అందక చాలా మంది చనిపోతున్నారు. అందుకే ప్రతిరోజు డాక్టర్ లు కరోనా వచ్చిన వారితో పాటు కరోనా లేని వారు కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆక్సీజన్ స్థాయిలను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు..అయితే మనలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోవాలి అంటే మాత్రం కచ్చితంగా మనకు ఆక్సీకరణ మీటర్ తప్పనిసరి.. అయితే ఇప్పుడు ఎలాంటి మీటర్లతో పని లేకుండా కేవలం మీ వద్ద ఒక స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. ఇట్టే మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి  ఎంత ఉందో ఇట్టే తెలిసిపోతుంది.. అయితే స్మార్ట్ ఫోన్ లో  ఆక్సిజన్ స్థాయి లు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్..ఈ యాప్ ద్వారా ఆక్సిజన్ లెవల్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.అయితే ఈ కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుందో ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

యూ ఎస్ లోని కేర్‌ప్లిక్స్ హెల్త్‌కేర్  అలాగే ఇండియా లోని కేర్‌నౌ హెల్త్‌కేర్ రెండు కలిసి సంయుక్తంగా నిర్మించిన  మొదటి ఉత్పత్తి కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్. ఈ  యాప్ ద్వారా హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ లెవల్స్  అలాగే శ్వాసక్రియ రేటు వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడం కోసం మొబైల్ స్మార్ట్ ఫోన్ లో  కెమెరా  అలాగే ఫ్లాష్‌లైట్‌ ఉపయోగించి, స్కానింగ్ ద్వారా, ఆక్సిజన్ రేటు, శ్వాసక్రియ రేటును సులభంగా పరీక్షించవచ్చు.

పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లు పనిచేసే ఫోటోప్లెతీస్మోగ్రఫీ ఆధారంగా, స్మార్ట్‌ఫోన్‌ కెమెరా, ఫ్లాష్‌లైట్‌తో ఈ యాప్‌ పని చేస్తుంది. కెమెరా, ఫ్లాష్‌లైట్‌ మీద 40 సెకన్లు వేలిని ఉంచడం ద్వారా SpO2 ను లెక్కించవచ్చు. లైట్‌ ఇంటెన్సిటీలో తేడాలను పసిగట్టి ఫోటోప్లెతీస్మోగ్రఫీ గ్రాఫ్‌ను ఈ యాప్‌ సిద్ధం చేస్తుంది. ఈ గ్రాఫ్‌ సాయంతో SPo2 స్థాయి, పల్స్ రేట్‌ తెలుసుకోవ్చని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ చెబుతోంది.


అయితే మీరు ఈ యాప్ ను  డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేదు. కానీ కేర్‌ప్లిక్స్ వైటల్స్ అధికారిక  వెబ్సైట్ ను సందర్శించి, APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేర్‌ప్లిక్స్ వైటల్స్ APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి,  కేర్‌ప్లిక్స్ వైటల్స్ వెబ్‌సైట్‌లోని ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్ అనే చోట క్లిక్ చేస్తే చాలు.Carenow హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండియా) ప్రచురించిన యాప్ ఎంచుకోవాలి.. ఇక సులభం గా స్మార్ట్ ఫోన్ లోని  ఆక్సీజన్ స్థాయిలను చెక్ చేసుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: