రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో కి టెలికాం రంగంలోకి అడుగుపెట్టి ఊహించని విధంగా తక్కువ ధరకే మొబైళ్లను, 4జి సేవలను అందిస్తోంది జియో. ఇక వీటి తరువాత జియో మొబైల్స్ నెక్స్ట్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మొబైల్ లను ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా కేవలం రూ.4,499 రూపాయలకే మనకు లభిస్తుంది అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉండబోతోంది. ఎక్స్చేంజ్ విభాగంలో పాత డివైస్ లో కలిగిన 4 జి స్మార్ట్ మొబైల్స్ , ఇతర స్మార్ట్ మొబైల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఎవరైనా వినియోగదారులు ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఉపయోగించకపోతే వారికి జియో నెక్స్ట్ మొబైల్ రూ.6,499 రూపాయలకు ఉండవచ్చు. దీనిని ముందుగానే పొందాలనుకుంటే వినియోగదారులు రూ.2500 రూపాయలు ముందస్తుగా చెల్లించి ఫైనాన్సింగ్ ఎంపిక చేసుకోవాలి. ఇక ఈ మొబైల్ రూ.501 ప్రాసెసింగ్ రుసుం కూడా కలదు. ఇప్పుడు jio నెక్స్ట్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం.

జియో నెక్స్ట్ మొబైల్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ విభాగంలో ఇది కూడా ఒకటి. ఇది వాయిస్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ , ట్రాన్స్లేషన్ వంటి సదుపాయం కూడా కలదు. ఈ బడ్జెట్లో  4g స్మార్ట్ మొబైల్ లభిస్తుందంటే కేవలం ఇది ఒక్కటే అని చెప్పవచ్చు.. ఇక ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 5.45  అంగుళాలు కలదు. ఇక డిస్ప్లే రిజల్యూషన్ విషయానికి వస్తే..720X1440 కలదు. 4g సిమ్ స్లాట్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..3500 mah కెపాసిటీ కలదు. కెమెరా విషయానికి వస్తే 13 mp సెన్సార్ తో వెనుకభాగం సింగిల్ కెమెరా కలదు మరియు సెల్ఫీల కోసం, వీడియో కాల్ కోసం 8 mp ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 2gb ర్యామ్ ,32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: