ఒకప్పట్లో అయితే మొబైల్ ఫోన్లను ఆలా రాత్రంతా ఛార్జింగ్ లో ఉంచితే సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతగానో మారింది. దాంతో పాటుగా ఛార్జింగ్ విషయం లోనూ కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ని రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచినా పెద్దగా ప్రమాదం లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం వాడకంలో ఉన్న స్మార్ట్ ఫోన్ల బ్యాటరీల లో లిథియం-అయాన్ లు.. ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఇవి విద్యుత్‌ను సంగ్రహించకుండా నిరోధించే పరికరాలను ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. అయితే..అలాగని అన్నివేళలా ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉంచడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే విద్యుత్ పంపిణీ ఎపుడు ఒకేలా ఉండదు.. హెచ్చుతగ్గులు ఉంటాయి అలాంటప్పుడు ఛార్జింగ్ లో ఫోన్ ని అస్సలు చూసుకోకుండా వదిలేయడం మంచిది కాదు అంటున్నారు. అలాంటప్పుడు అన్ని మోడల్ ఫోన్లు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలవా ? లేదా అన్నది ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి విషయం. అందుకనే వీలైంత వరకు ఫోన్లను రాత్రులు ఛార్జింగ్ లో వదిలేయకుండా ఉండటమే మంచిది. అలాగే 40 % కంటే ఛార్జింగ్ తక్కువ కాక ముందే ఫోన్ ని ఛార్జింగ్ కి పెట్టడం మంచిది అని అంటున్నారు.