సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ కానీ స్పెషల్ రోజు కానీ ఎలక్ట్రిక్ వస్తువుల పైన మోటార్ వాహనాల పైన కూడా పలు రకాల కంపెనీలు డిస్కౌంట్ లను ప్రకటిస్తూ ఉంటాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేవారికి మరింత డిస్కౌంట్ కూడా అందిస్తూ ఉంటారు కానీ అదే రోజున కొత్త వాహనాలు కొనే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటారు కనుక.. వీటిని దృష్టిలో పెట్టుకొని మరి ప్రముఖ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బైకుల పైన అదిరిపోయే ఆఫర్ ను మొదలుపెట్టింది.


ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ పై అక్షయ తృతీయాను పురస్కరించుకున్న 72 గంటలకు ఎలక్ట్రిక్ రష్ అనే ఒక లిమిటెడ్ ఆఫర్ ని సైతం ప్రకటించింది. ఈ ఆఫర్ ఈరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా తగ్గింపులు, వారంటీలు వంటివి ఉంటాయి అలాగే ఎంపిక చేసుకున్న రాష్ట్రాలలో అదే రోజు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్లను డెలివరీ చేసే విధంగా చూస్తున్నారట. ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఆఫర్ jen -1,jen-3 మోడల్స్ తో సహా S1 పోర్టు పోలియో అంతటా కూడా 40 వేల రూపాయలను డిస్కౌంట్ అందిస్తోంది.


అయితే ఈ తగ్గింపు ధరల తర్వాత GEN -2 బైక్ 67 వేల రూపాయల..GEN -3 బైక్ 74 వేల రూపాయలు (ఎక్స్ షోరూం అన్ని ధరలు) ప్రారంభమవుతాయట. ఇక ఓలా హైపర్ డ్రిప్ సర్వీస్ కింద అదే రోజు కూడా డెలివరీ రిజిస్ట్రేషన్ అన్ని కూడా చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే ఉన్నదని తెలియజేశారు. ఎవరైనా ఈ బైకులు కొనుగోలు చేస్తే ఆన్లైన్ లేదా డీలర్ షిప్ విభాగంలో కొనుగోలు చేయాలని తెలియజేశారు. ఇక ఓలా నే కాకుండా అటు హుండా మోటార్స్, ఆటో వంటి ఇతరత్రా కంపెనీలు కూడా ఈ ఆఫర్లను ప్రకటించాయి. అయితే పూర్తి సమాచారం కోసం డీలర్ షిప్పులను సందర్శించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: