గమ్యాన్ని అతి తక్కువ సమయంలో చేర్చె వాటిలో మెట్రో ఒకటి.. రాను రాను మెట్రోకు డిమాండ్ కూడా భారీగా పెరిగిపోతుంది..రైలులో అతి తక్కువ సీట్లు ఉన్నా కూడా నిల్చున్న కూడా బాగుంటుంది. అందుకే చాలా మంది మెట్రోను వాడుతున్నారు. కొన్ని సార్లు మెట్రో లో కొన్ని జరుగుతున్నాయి.అవి వైరల్ అవుతున్నాయి.. మెట్రో సర్వీసు బాగోలేదనో లేక మరెయితర కారణం వల్ల నో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఆ వీడియో లో మహిళ పసి బిడ్డను పట్టుకుని ఉంటుంది.


పసిబిడ్డతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించిన ఒక మహిళ సీటుపైన గాక నేలపై కూర్చొన్నది. మరోవైపు చాలా మంది మంది మహిళలు సీట్లలో కూర్చొని మొబైల్‌ ఫోన్లు చూడటంలో బిజీ అయ్యారు.అందులో ఒక మహిళ తన పసిబిడ్డతో కలిసి మెట్రో రైలులో ప్రయాణిస్తుంది. అయితే ఆమె సీటుపై కాకుండా పసిబిడ్డతో రైలులోని నేలపై కూర్చొని ఉంది. మరోవైపు చాలా మంది మహిళలు దర్జాగా సీట్లలో కూర్చొన్నారు. ఏ ఒక్కరు కూడా పసిబిడ్డతో ఉన్న ఆ మహిళలకు సీటు ఇవ్వలేదు. అందులోని మహిళా ప్రయాణికులు పసిబిడ్డతో ఉన్న ఆ మహిళను ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింతో అన్నది తెలియలేదు.

కాగా, ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ దానికి ఒక శీర్షిక కూడా ఇచ్చారు. 'చదువు మీ ప్రవర్తనలో ప్రతిబింబించకపోతే మీ డిగ్రీ కేవలం కాగితం ముక్క మాత్రమే' అని పేర్కొన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో పసిబిడ్డతో కింద కూర్చొన్న మహిళకు సీటు ఇవ్వని మిగతా మహిళా ప్రయాణికుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. 'ఇతరుల గురించి, వారి బాధలు, సమస్యలు పట్టని సున్నిత సమాజంగా మనం క్రమంగా మారుతున్నాం' అని ఒకరు వ్యాఖ్యానించారు..అయితే ఆ వీడియో పాతది అని తేలింది..సదరు మహిళకు సీటు ఇచ్చిన కూడా ఆమె కింద బిడ్డ తో బాగుందని చెప్పిందని చెప్పారు..మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: