ప్రస్తుతం ప్రతి మనిషి కూడా సోషల్ మీడియా అనే కొత్త లోకంలో బ్రతికేస్తూ ఉన్నాడు. ఇక అందరికీ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా మాయలో పడిపోతున్నారు అని చెప్పాలి. ఒకసారి సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడ్డారు అంటే చాలు ఇక దాని నుంచి బయటపడటం ఎవరి తరం కావట్లేదు. దీంతో ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి.. ఇక గంటల తరబడి సోషల్ మీడియా చూస్తూ ఉండిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇలాంటి సోషల్ మీడియా కారణంగానే ఇక ప్రపంచ నలుమూలల్లో జరిగిన ఘటనలు కూడా కేవలం నిమిషాల వ్యవదిలో  అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతున్నాయి. ఇక ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఘటన గురించి. సాదరణంగా పాములను చూస్తే ప్రతి ఒక్కరు భయపడి పోతారు.  కళ్ళ ముందు ఉంది విషపూరితమైన పాము కాదు అని తెలిసిన కూడా అటువైపుకు వెళ్లడానికి ఎందుకో గుండె ధైర్యం సరిపోదు. కొంతమంది పైనకు ధైర్యంగా కనిపించిన లోలోపల  మాత్రం భయపడుతూ ఉంటారు. ఇక పామును పట్టుకోవడం అంటే అంత సాహసం ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఇలాంటి సాహసం చేసింది. ఒక్క పామును పట్టుకోవడం కాదు ఏకంగా భారీ సైజు ఉన్న రెండు పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ముందుగా ఎంతో సైలెంట్ గా నడుచుకుంటూ వచ్చింది యువతి. ఎందుకు అలా వస్తుందో ఎవరికీ అర్థం కాదు. ఆ తర్వాత ఒక్కసారిగా రెండు పాపులు తోకలనుపట్టుకుంటుంది. అవి పారిపోయేందుకు ప్రయత్నించినా వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఈ వీడియో చూసి ఆ అమ్మాయి ధైర్యానికి అందరూ ఫీదా అవుతున్నారు నేటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: