అడవుల్లో జీవించే ప్రతి జీవి కూడా నిత్యం పోరాటం చేయాల్సిందే అని చెప్పాలి. ఒక జంతువు ఏకంగా ప్రాణాలను దక్కించుకోవడానికి.. ఇతర జంతువుల ప్రాణాలు తీయాల్సి వస్తే.. ఇక మరో జీవి ఇతర జంతువుల నుంచి తమ ప్రాణాన్ని  రక్షించుకోవడానికి ప్రతిక్షణం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఇలా రెండు జంతువులది కూడా బ్రతుకు పోరాటమే. ఈ పోరాటంలో గెలిచేది ఒకే ఒక్క జంతువు మాత్రమే. ఇలా అడవుల్లో క్రూర మృగాలైన పులులు సింహాల చేతిలో అడవి దున్నలు లేదా జింకలు లాంటివి బలవ్వడం ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి.



 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే వైరల్ గా మారిపోయింది. సాధారణంగా సింహాన్ని అడవికి రారాజు అని అంటూ ఉంటారు. ఒక్కసారి సింహం కన్ను పడింది అంటే చాలు దాని పంజా నుంచి ఏ జీవి కూడా తప్పించుకోలేదు. ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకొని సింహానికి ఆహారంగా మారిపోవాల్సిందే. అలాంటిది ఏకంగా పదుల సంఖ్యలో ఉన్న సింహాల గుంపు దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఇంకేముంది ప్రాణాలు అటు నుంచి అటే గాల్లో కలిసిపోతాయి. కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో మాత్రం అలా జరగలేదు. పదుల సంఖ్యలో ఉన్న సింహాల గుంపు దాడి చేస్తున్న ఇక అడవి దున్న  మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు.



 ఒకవైపు తన కొమ్ములతో సింహాలను భయపెడుతూనే మరోవైపు ఈ సింహాల గుంపు నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఎంతో తెలివిగా ఆలోచించింది. ఈ క్రమంలోనే ఎంతో తెలివిగా ఆలోచించినా ఆ అడవితున్న ఏకంగా పక్కనే ఉన్న నీటి కొలనులోకి దిగుతుంది. అయితే సింహాలు నీటిలోకి రావు. దాంతో అది ధైర్యంగా ఆ నీటిలోకి దిగి సింహాల నుంచి తప్పించుకుంది. అయితే నీటిలోకి దిగిన తర్వాత మరోసారి సింహాల గుంపువైపు లుక్కేసి ఇప్పుడు రండిరా చూసుకుందాం అన్నట్లుగా లుక్ ఇచ్చింది అని చెప్పాలి.  ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: