దేవాలయం అంటే సమాజంలో ఎంత గౌరవం ఉందో న్యాయస్దానం, పోలీస్‌స్టేషన్ అన్న అంతే గౌరవం ఉంది.. అందుకే మనుషులు ఆపద వస్తే ముందుగా పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతారు.. ఆ తర్వాత భగవంతున్ని ఆ ఆపదనుండి గట్టెకించమని వేడుకుంటారు.. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ పోలీస్‌స్టేషన్ వెళ్లిన ప్రతివారికి న్యాయం జరుగుతుందా అంటే లేదనే చెప్పవచ్చు.. ఎందుకంటే పోలీసులు అంటేనే అవినీతికి అన్నదమ్ములు అనే అభిప్రాయం ప్రజల్లో ఉందట.. కానీ ఈ అభిప్రాయాన్ని తుడిచేయడానికి పోలీస్ బాసులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు, ఇందులో భాగంగా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు..

 

 

కానీ ఇది అన్నిచోట్ల ఫలితాలను ఇస్తుందా అంటే లేదని చెప్పవచ్చు.. ఎందుకంటే డిపార్ట్‌మెంట్లో ఉన్న కొందరి వల్ల సిన్సియర్‌గా డ్యూటీ చేసే వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది.. ఇక ఖాకీ డ్రెస్ అంటే ఏమనుకుంటారో కొందరు.. తమలోని అహంకారాన్ని ప్రదర్శించడానికి వాడే ఆయుధంగా భావిస్తారు కావచ్చూ.. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే ఘటనను చూస్తే ఇలాంటి భావమే కలుగుతుంది.. ఎందుకంటే తనకు న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువకుడిపై మహిళా ఎస్సై అమానుషంగా ప్రవర్తించిన విధానం చూస్తే అసలు వీళ్లు రక్షక భటులా, యమభటులా అనిపిస్తుంది..

 

 

ఆ విషయాన్ని పరిశీలిస్తే, ఒడిశాలోని తరలసరువా గ్రామానికి చెందిన రాజు మహంత్‌ అనే యువకుడు భూతగాదా పరిష్కారం కోసం కియోంజార్‌ జిల్లాలో ఉన్న పటనా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ ఆ పీఎస్‌లో విధుల్లో ఉన్న సంధ్యరాణి జెన అనే ఎస్సై, సదరు యువకుడిపై దాడి చేసింది. దారుణంగా లాఠీతో కొట్టి హింసించడమే కాకుండా, కాలితో తన్నింది. ఆ ఎస్సై ఇంతలా రెచ్చిపోతున్నా అక్కడున్న మిగితా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకపాత్ర వహించడం నిజంగా దురదృష్టకరం..

 

 

ఇకపోతే సదరు మహిళా ఎస్సై దాష్టికానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు అధికారిణిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: