గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః....అంటారు కానీ అది పాటించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. గురువును పూజించే వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు. మహా అయితే గురువు కనిపిస్తే నమస్కారం పెడతారు. కొంతమంది అది కూడా చేయకుండా ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు. కానీ తాజాగా విజయనగరం జిల్లాలో గురువుకు నిజంగానే పూజలు చేశారు. కాళ్ళు కడిగి దండాలు పెట్టారు. తమ ఊర్లో పాటలు చెప్పిన పంతులుకు బదిలీ అయితే ఊరంతా ఊరేగిస్తూ పండగ జరిపారు. వివరాల్లోకి వెళితే...విజయనగరం జిల్లా గమ్మ లక్ష్మీపురం మండలం మలుగూడ ప్రభుత్వ పాఠశాలలో గౌడు నరేంద్ర 2011 నుండి ఉపాద్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆ పాఠశాలకు షెడ్డు లేదు...కనీస వసతులు కూడా లేవు అయినప్పటికీ  చెట్ల కింద మరియు శిథిలా వస్థలో ఉన్న షెడ్డులోనే పాఠాలు బోధించి ఊరి ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు. ఊర్లో అందరితో స్నేహంగా ఉంటూ వారి ప్రేమాభిమానాలు సంపాదించాడు. విద్యార్థులకు ఎంతో ఓపికగా సహనంగా చదువు చెప్పాడమే కాకుండా పై చదువులకు వెళ్లే వాళ్లకు తగిన సూచనలు సలహాలు ఇచ్చేవాడు. అలాంటి ఉపాద్యాయుడు ఊరి నుండి బదిలీ అవ్వడంతో అంత బాధ పడ్డారు. విద్యార్థుల కోసం ఇన్నాళ్లు కష్టప్పడ్డ ఉపాద్యాయుడికి ఘన సన్మానం నిర్వహించాలని నిర్బయించుకున్నారు. దాంతో నరేంద్ర తో పాటు ఆయన సతిమనికి సన్మానం చేశారు. నరేంద్ర పాదాలు కడిగి పూజ చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లతో ఊర్లో  ఊరేగింపు  నిర్వహించారు. ఈ వేడుకతో ఊర్లో పండగ వాతావరణం కనిపించింది. నరేంద్ర ను భుజాలపై ఎత్తుకుని డ్యాన్సులు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. తోటి ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. ప్రస్థుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు కూడా ఈ ఉపాద్యాయుడిని అభినందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: