దీనికి సంబంధించిన వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఈ గొడవలో ఏకంగా మహిళలు కూడా ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక అక్కడే ఉన్న ఇతర పర్యాటకులు అందరికీ కూడా ఈ గొడవ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. చైనా రాజధాని అయిన బీజింగ్లో ఉన్న వైల్డ్ లైఫ్ పార్కులో ఈ వైల్డ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పెద్ద ఎత్తున జూలోని జంతువులను చూసేందుకు సందర్శకులు వచ్చారు. ఈ క్రమంలోనే ఏదో విషయం పై అక్కడ ఉన్న ఇద్దరు సందర్శకుల మధ్య గొడవ మొదలైంది.
చిలికి చిలికి గాలి వాన అయినట్లు ఇక వారి మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ ఏకంగా రెండు కుటుంబాల గొడవ గా మారిపోయింది.ఏకంగా ఒకరిని ఒకరు దారుణంగా దాడి చేసి కొట్టుకునే స్థాయికి వెళ్లి పోయింది. ఇక రెండు కుటుంబాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు పడి పోయి మరి కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే మహిళలు కొట్టుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఏకంగా చంటి పిల్లాడిను ఎత్తుకున్న మహిళను కాలితో తన్నడం తో ఆ మహిళ వెళ్లి దూరంగా పడింది. అయితే ఇలా అందరూ దారుణంగా కొట్టుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న జంతువులు సైతం అవాక్కయ్యాయ్. ఇక అంతలో ఎంట్రీ ఇచ్చిన జూ సిబ్బంది వారి గొడవ సద్దుమణిగేలా చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి