ఇక మరికొంత మంది దొంగలు అయితే ఏకంగా పట్టపగలే అందరూ చూస్తుండగానే దొంగతనానికి పాల్పడి ఏకంగా పోలీసులకు సవాల్ విసరడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా పట్టపగలు దొంగతనాలకు పాల్పడిన వారిలో ఎక్కువగా చైన్ స్నాచర్లు కనిపిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్గా చేసుకుని ఎంతోమంది చైన్ స్నాచర్లు రెచ్చి పోతూ ఉంటారు. ద్విచక్రవాహనంపై వచ్చి ఏకంగా మహిళ మెడలో ఉన్న చైన్ లాక్కొని పోతూ ఉంటారు. ఇక ఇలాంటి చోరీలకు సంబంధించిన ఘటనలు సీసీ కెమెరాల్లో రికార్డయి ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వైరల్ గా మారిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి.
ఇక్కడ ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఎంతోమందిని అవాక్కయ్యేలా చేస్తుంది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అందరూ చూస్తుండగానే పట్టపగలు ఒక మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కుపోయారు. ఏకంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెదిరిస్తూ గొలుసు లాక్కుని పోయారూ. కుమారుడిని ట్యూషన్ లో దింపేందుకు స్కూటీపై వెళ్తుంది మహిళా. ఇక అంతలో అక్కడ కాపు కాచుకు కూర్చున్నారు ఇద్దరు దుండగులు ఇక గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించగా మొదట వెనకాల ఉన్న కుమారుడు కూడా ప్రతిఘటించాడూ. అంతలోనే జేబులో ఉన్న తుపాకీ తీయడంతో వాళ్ళు బెదిరిపోయారు. అటు ఇక గొలుసు లాక్కుని పోతున్నప్పటికీ అలాగే చూస్తూ ఉండిపోయారు చుట్టుపక్కల వాళ్ళు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి