మ‌న రాష్ట్రంలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు విజ‌య‌వంతంగా ముగిశాయి. ఇప్ప‌టికే దాదాపు అన్ని గ‌ణేష ల వ‌ద్ద ల‌డ్డు ల‌ను వేలం వేశారు. మన‌కు తెలిసి అత్య‌ధిక ధ‌ర‌కు పోయిన ల‌డ్డు బాలాపూర్ దే అని మ‌న‌కు తెలుసు. బాలాపూర్ గ‌ణేష్ ల‌డ్డును వేలంలో రూ. 18.90 ల‌క్ష‌ల‌కు అమ్ముడు పొయింది. అయితే మ‌రో ల‌డ్డు దీన‌కి కంటే ఎక్కువ ధ‌ర ప‌లికింది. ఇది ఆల‌స్యం అంద‌రికీ తెలసింది. ఒక ల‌డ్డుకు ఇంత ధర ప‌లికిందా అని ప్ర‌జలు నెరెల్ల బెడుతున్నారు. వినాయ‌క చ‌వితి కి వేలం వేసే ల‌డ్డు కు మంచి డిమాండ్ ఉంటుంది. వినాయ‌కుని వ‌ద్ద న‌వ రాత్రులు పూజ‌లు చేయ‌డం వ‌ల్ల అ ల‌డ్డు శ‌క్తి వంతంగా మారుతుంది అని భ‌క్తుల న‌మ్మకం.




అందుకే ఎంత ఖ‌ర్చు అయినా వెన‌కాడ కుండా వినాయ‌కుని వ‌ద్ద ఉన్న ల‌డ్డు ను వేలంలో ద‌క్కించుకుంటారు. అయితే మ‌న రాష్ట్రంలో మ‌నకు తెలిసి బాలాపూర్ ల‌డ్డే అధిక ధ‌ర ప‌లికింది అని అనుకుంటున్నారు. కానీ మ‌న రాష్ట్రంలోనే అంతే కాదు మ‌న హైద‌రాబాద్ న‌గ‌రం లోనే వినాయ‌కుని రికార్డు ధ‌ర ప‌లికింది. ఎంతో తెలుసా అక్ష‌రాల రూ. 41 ల‌క్ష‌లు. ఎంటి ల‌డ్డుల కంపెనీ ధ‌ర చెబుతున్న అనుకున్నార.. కాదు కేవ‌లం 5 కేజీ ల ల‌డ్డు గురించే. వామ్మో ఒక ల‌డ్డు కు ఇంత ప్రైజ్ అనుకుంటున్నారా.. అవునండి. ఇది మ‌న హైద‌రాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ స‌న్ సిటీకి చెందిన కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ గేటెడ్ క‌మ్యూనిటీలో గ‌ల వినాయ‌కుని వ‌ద్ద ఈ ధ‌ర ప‌లికింది.




రాజేంద్ర‌న‌గ‌ర్ స‌న్ సిటీకి చెందిన కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ గేటెడ్ క‌మ్యూనిటీలో 179 విల్లాస్ ఉంటాయి. వీటిలో 82 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్క‌డ ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది వినాయ‌క ఉత్స‌వాలు జ‌రుపుకున్నారు. అందులో భాగంగా నిమ‌ర్జ‌నం ముందు 5 కేజీల ల‌డ్డు ను వేలం వేశారు. ఈ వేలంలో ల‌డ్డు రూ. 41 ల‌క్ష‌లు ప‌లికింది. ఇంత ఖ‌ర్చు చేసి ల‌డ్డు ద‌క్కించు కోవడంతో న‌గ‌ర‌వాసులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అయితే గ‌తంలో 2019లో కూడా ఇక్క‌డ ల‌డ్డు కు రూ. 27 ల‌క్ష‌లు ప‌లికింద‌ని ఆ కాల‌నీవాసులు చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: