కట్టుకున్న భర్తను ప్రియుని మోజులో పడి భర్తను అతి కిరాతకంగా హతమార్చిన ఘటన  సంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట పోలీస్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. మోమిన్‌పేట  చుట్టుపక్కల ఉన్న  ఓ నిర్మానుష ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి తలకు గాయం కారణంగా తీవ్ర రక్త స్రావం గమనించి స్థానికులు సంగారెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రి కి తరలించారు. గాయపడ్డ వ్యక్తిని చిన్నమల్కు శివశంకర్‌(30) గా గుర్తించారు. అయితే చికిత్స పొందుతూ శివశంకర్ మరణించాడు. వెంటనే మోమిన్పేట పోలీస్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో జరిగిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగు తిన్నారు. కట్టుకున్న భార్యే అతడిని చంపించిందన్న విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.



పూర్తి వివరాలలోకి వెళితే నవాబ్‌పేట మండలం లోని ఎల్లకొండ గ్రామానికి చెందినటువంటి చిన్నమల్కు శివశంకర్‌(30) తో వెల్దుర్తి గ్రామానికి చెందిన శివలీల అనే యువతీ తో  తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికీ ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె. శివ శంకర్ రోజు మద్యం సేవించి వచ్చి శివలీలతో రోజు గొడవ పడేవాడు . అతని ప్రవర్తనకు విసుగు చెందిన శివలీల ఏడాది క్రితం తన అమ్మ గారింటికి వెళ్ళింది . ఈ క్రమంలోనే ఆ గ్రామంలో ఉంటున్న జహంగీర్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్త దూరంగా ఉండడంతో అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే భర్త ఇంటికి రావలసిందిగా పెద్దమనుషుల సమక్షంలో శివలీలను కోరగా ఏడు నెలల క్రితం కాపురానికి వచ్చింది. కానీ జహంగీర్‌ తో పరిచయం మరువలేక శివలీల అతడిని తన ఇంటికి పిలిపించుకునేది.



ఇలా అప్పుడప్పుడు జహంగీర్‌ వచ్చివెళుతు ఉండేవాడు. ఈ విషయాన్నీ తెలుసుకున్న శివశంకర్ భార్యని ఈ విషయమై రోజూ గొడవ పడుతూ ఉండేవాడు. భర్త క్రియలను నరకంగా భావించిన భార్య జహంగీర్‌ తో తన భర్తను హతమార్చవలసింది గా కోరింది. జహంగీర్‌  శివశంకర్ కు ఫుల్ గా తాగించి ఎవరూలేని నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లాడు . మత్తులో ఉన్న శివశంకర్ ను బండరాయితో మోది అక్కడినుండి వెళ్ళిపోయాడు . తరువాత జరిగిన విషయాన్నీ ప్రియురాలు శివలీల తో ఫోన్ చేసి చెప్పాడు. తీవ్ర రక్త స్రావం లో పడివున్న శివశంకర్ ను మరుసటి రోజు ఉదయం అటువెళుతున్న గ్రామస్తులు చూసి వెంటనే సంగారెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు .




చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. మృతుని చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసారు. అయితే మొదట్లో సంబంధం లేని హత్యగా భావించిన పోలీసులు అతని భార్యపై ఎటువంటి అనుమానం పెట్టుకోలేదు . అయితే శివశంకర్ భార్యతో జహంగీర్ తో ఉన్న సంబంధం తెలుసుకున్నతరువాత పోలీసులకు భార్యపై అనుమానం మొదలైంది . ఇందులో భాగంగానే శివలీల ఫోన్ కాల్ డాటాను పరిశీలించినప్పుడు. జహాంగీతో శివలీల అక్రమ సంబంధం బయటపడింది. దింతో శివలీలను పోలీస్టేషన్ కి తీసుకువెళ్లి ఓ పట్టుపట్టగా అసలువిషయం బయటపెట్టింది


మరింత సమాచారం తెలుసుకోండి: