ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు. ఇక ప్రతి జీవి కూడా ప్రత్యేకమైన జీవనశైలని కలిగి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎందుకో తెలియదు కానీ కొన్ని జీవుల మధ్య మాత్రం పుట్టుకతోనే వైరం ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. ఇక ఆ రెండు జీవులు ఎప్పుడైనా ఎదురుపడ్డాయి అంటే చాలు ఆ వాటి మధ్య బీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది. ఇలా జాతి వైరంతో పుట్టే జీవులు ఏవైనా ఉన్నాయి అంటే అందులో నాగుపాము, ముంగిస మొదటి వరుసలో ఉంటాయి. ఈ రెండు ఎక్కడ ఎదురుపడిన కూడా అక్కడ వికరమైన పోరు జరుగుతూ ఉంటుంది. ఈ రెండు జీవులలో ఏదో ఒకటి మాత్రమే చివరికి ప్రాణాలతో ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇలా పాము ముంగిస ఎంతో దారుణంగా ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో ప్రత్యక్షం అయ్యాయి అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి యూట్యూబ్ ని ఊపేస్తూ ఉంది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్లు సైతం షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే.. పొరపాటున ఒక కాలువలో ముంగిస ఒక నల్లటి నాగుపాము ఎదురుపడ్డాయి. అయితే ఆ కోబ్రాను చూసిన ముంగిస వెంటనే దాడి చేయడానికి సిద్ధం అయిపోతుంది.


 దాడి చేయడానికి రావడంతో నాగూ పాము కూడా వెంటనే అప్రమత్తమవుతూ ఇక ముంగిసను తన కోరలతో చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీంతో ఈ రెండిటి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఎంతో వేగంగా కదిలిన ముంగిస పాముకు దొరక్కుండా దాడి చేస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఏకంగా పాము తలను నోట్లో పట్టుకుని గింగిరాలు తిప్పేస్తూ ఉంటుంది ముంగిస. దీంతో ఆ పాము విలవిలలాడిపోతుంది. చివరికి ఈ ముంగిస దాడిలో పాము చనిపోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: