భారతదేశంలో కరోనా తర్డ్ వేవ్ ముగిసింది.. దీంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఇప్పుడు తాజాగా క్రమంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. గత రెండు రోజుల నుంచి 3 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ ,గుజరాత్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ బాధితుల సంఖ్య ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మూడు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా 10 వేల మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నట్లు సమాచారం. దేశంలోనే మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 15208 అంటే 3852 మంది యాక్టివ్ పేషెంట్లు కేరళలోని అగ్రస్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ తరువాత గుజరాత్ లో 3016 కేసులో రెండవ స్థానంలో ఉండగా మూడవ స్థానంలో మహారాష్ట్ర 2247 కేసులు ఉన్నట్లుగా సమాచారం  ఈ మూడు రాష్ట్రాలలో కోవిడ్ పాజిటివ్ రేటు క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలోనే వారం రోజుల వ్యవధిలోని కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని కేవలం రెండు రోజుల వ్యవధిలోని 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు.

మహారాష్ట్ర ,గుజరాత్ ,కేరళలోని పాటు రాజధాని ఢిల్లీలో కూడా కరోనా వైరస్ విస్తరిస్తోంది . ఢిల్లీలోని పలు జిల్లాలలో కోవిడ్ పాజిటివ్ రేటు 13% దాటిందని రాజధానిల పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్టి ముఖ్యమంత్రి అరవింద్ క్రేజ్ వాల్ సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదనీ..కోవిడ్ నివారణకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. మహారాష్ట్ర ఢిల్లీలో కూడా కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఘం పెరుగుతూనే ఉన్నదట..ఢిల్లీలో ఆసుపత్రిలో అరవమందికి పైగా కరోనా రోగులు చేరినట్లుగా నిర్ధారించారు ముంబైలో 30 మంది రెండు తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ మరణాల రేటు నమోదు కాలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: