ఇలా చిన్నపాటి నిర్లక్ష్యాలు ఎంత మూల్యాన్ని చెల్లించుకోవడానికి కారణం అవుతాయి అన్నదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. గణేశుడిని ప్రతిష్టించుకున్న ప్రతి ఒక్కరు కూడా గణనాథుని చెరువులు దగ్గరలో ఉన్న సరస్సులలో నిమజ్జనం చేయడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి నిమజ్జన కార్యక్రమంలో చిన్నపాటి నిర్లక్ష్యాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాలను నింపుతున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇలా నిమజ్జనానికి పిల్లలను తీసుకువెళ్లే సమయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి చిన్నపిల్లలను తీసుకొని గణేష్ విగ్రహాన్ని చేతిలో పట్టుకుని మెట్లు దిగుతూ నిమజ్జనం చేసేందుకు ముందుకు వెళ్తాడు. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న పిల్లలు అది ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. తీరా గణేశుడు నీటిలో మునిగి సమయంలో వెనక ఉన్న ఒక బాలిక మెల్లగా ముందుకు వస్తుంది. వచ్చి రావడంతోనే ఒక్కసారిగా అడుగు ముందుకు వేస్తుంది. దీంతో నీటిలో మునిగిపోతుంది. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అయ్యారు. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో అక్కడున్న వారు ఆ బాలికను కాపాడగలిగారు.