
నకిరేకల్ కు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు ఓ కోడిని ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంది. రోజూ ఆ కోడి బయట తిరిగి నచ్చింది తిని సాయంత్రానికి ఇంటికి వచ్చేది. కొద్ది రోజుల నుంచి ఆ కోడి గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంటి గట్టివాము వద్ద గింజలు తినడం మొదలు పెట్టింది. అయితే తాజాగా అది చూసిన రాకేష్ ఆగ్రహంతో ఆ కోడిని కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో కోడి కాళ్లు విరిగిపోయాయి. ఇది గమనించిన గంగమ్మ తన కోడిని పట్టుకుని లబోదిబోమంటూ నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.
నా కోడికి న్యాయం చేయాలంటూ పోలీసులు ఎదుల విలపించింది. మొదట పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి విస్తుపోయారు. రాకేష్ కర్రతో కొట్టడం వల్లే నా కోడి కాళ్లు విరిగి నడవలేక పోతుందని.. నాకు డబ్బులేమీ వద్దు.. రాకేష్ కు శిక్ష పడాల్సిందే అంటూ గంగమ్మ కంప్లైంట్ చేసింది. పోలీసులు ఆమెకు సద్ధి చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించారో. కానీ గంగమ్మ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక అటు కేసు పెట్టలేక, ఇటు వదల్లేక చివరకు పోలీసులు గ్రామానికి వచ్చి పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరిస్తామని గంగమ్మకు హామీ ఇచ్చారు. కోడికి చికిత్స చేయించమని సూచించారు. ప్రస్తుతం ఏ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు