కోటి గ్రూప్ ఆఫ్ వెంచెర్స్‌- నేడు ఈ సంస్థ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. 162 దేశాల్లో 70 కోట్ల ప్ర‌జ‌ల‌కు ఈ గ్రూప్ సేవ‌లు అందిస్తోంది. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా కొన్ని ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. అదేస‌మ యంలో మ‌న దేశంలో 32 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కు అనేక రూపాల్లో సేవ‌లు అందిస్తున్న సంస్థ‌లు.. కోటి గ్రూప్ సంస్థ‌లు. అగ్రిటెక్‌, ఎడ్యుటెక్‌, ఫైనాన్స్‌టెక్‌, హెల్త్ టెక్‌, క్వాలిటీ టెక్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్‌.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ టెక్నాల‌జీకి పెద్ద పీట వేస్తూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న సంస్థ‌లుగా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ‌ల వెనుక ఉన్న‌ది ఓ సామాన్యుడు! అసామాన్య ఆలోచ‌న‌లు.. అనిత‌ర‌సాధ్య‌మైన ఆశ‌యాలు.. సాధించిన విజయాలే స‌రిప‌ల్లి కోటిరెడ్డి..!

 

 

స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉంటాయి.. స‌మ‌స్య‌లు అంద‌రికీ ఉంటాయి. కానీ, ఆ స‌మ‌స్య‌ల‌నే అవ‌కాశాలుగా మ‌లుచుకుని అడుగులు ముందుకు వేసేవారు ఎందరు ఉంటారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తే.. వేళ్లమీద లెక్కించుకునే ప‌రిస్థితి ఉంది. ధీరూభాయ్ అంబానీ. ఓ ఆఫీస్‌లో బారువాలాగా ప్రారంభ‌మైన జీవితం కొన్ని మిలియ‌న్ డాల‌ర్ల సంస్థ‌ల ను ఏర్పాటు చేసే వ‌ర‌కు వెళ్లింది. ఇలా ఎద‌గ‌డం అంత తేలిక‌కాదు. స‌మ‌స్య‌లనే సోపానాలుగా చేసుకుని ముందుకు అడుగులు వేసిన మ‌హ‌నీయులు సాధించ‌లేని కూడా లేదు. ఇలాంటి వారినే ఆద‌ర్శంగా తీసుకున్న కోటిరెడ్డి.. త‌న ప్ర‌తి అడుగునూ అభ్యున్న‌తి దిశ‌గా వేశారు. 

 

కృష్ణాజిల్లా గుడివాడ‌లో అచ్చ ‌తెలుగు కుటుంబంలో జ‌న్మించిన కోటిరెడ్డి.. నేడు ప్ర‌పంచ స్థాయి టెకీగా పేరు తెచ్చుకున్నారు. ఈ పేరు, ప్ర‌ఖ్యాతులు.. ఒక్క‌రోజులోనో.. ఒక్క‌రాత్రిలోనే ఆయ‌న‌ను వ‌రించిన‌వి కావు. నిరంత‌ర సాధ‌న‌.. నిరంత‌ర కృషి.. స‌మ‌స్య‌ల‌ను త‌న‌కు అనుకూల సోపానాలుగా మార్చుకుని ప‌రుగులు పెట్టిన విధానం తెలుసుకుంటే.. కృషి ఉంటే.. మ‌నుషులు రుషుల‌వుతార‌న్న సూక్తిని నిజం చేసిన ఓ నాయ‌కుడు ఆయ‌న‌లో క‌నిపిస్తారు. నేను-నా ఉద్యోగం-నా కుటుంబం అని గిరిగీసుకుని ఆయ‌న కూర్చోకుండా.. నేను-నా స‌మాజం.. అంటూ ప‌రుగులు పెట్టారు. త‌నలో దాగి ఉన్న సృజ‌నాత్మ‌క‌త‌కు కృషిని జోడించారు. ఫ‌లితంగా ప్ర‌పంచ స్థాయికి ఎదిగారు. 

 

 

దేశ‌లో మొద‌టిసారి.. ధీరూభాయ్ అంబానీ ఓ స్టేడియంలో త‌న షేర్ హోల్డ‌ర్స్‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అలాంటి ప‌రిస్థితి త‌నూ క‌ల్పించుకుని ముందుకు సాగాల‌ని క‌ల‌లు గ‌న్న కోటిరెడ్డి.. ఆదిశ‌గా వేసిన అడుగులు ఫ‌లించాయి. నేడు కోటిరెడ్డి  సేవ‌లు లేని టెకీ సంస్థ లేదు.. ఆయ‌న‌ను స్మ‌రించ‌ని టెక్ దిగ్గ‌జ‌మూ లేడంటే అతిశ‌యోక్తి అనిపించ‌క‌మాన‌దు..!

మరింత సమాచారం తెలుసుకోండి: