ఒకప్పుడు మనిషి ఎలా ఉండేవాడు. ఇప్పటి కాలంలో మనుషులు ఎలా ఉంటున్నారు. మారుతున్న నాగరికత మనల్ని ఎంతగానో మార్చేసింది. ఇంకా మారుస్తుంది కూడా... ఇదంతా పరిణితి వలనే జరుగుతుంది. పరిణితి అనగా వృద్ది చెందుట, అయితే ఎంత మార్పు వచ్చింది అని లెక్కలు వేసేకన్నా ఆ పరిణితి వలన మనకు ఎంత మేలు జరిగింది అని పోల్చి చూసు కోవడం మంచిది. అదే విధంగా మనలో వచ్చే మంచి మార్పు మనకు మేలు చేసే మార్పు కూడా విజయంతో సమానమే. మార్పు మంచిదే అంటారు అయితే ఆ మార్పు మన అభివృద్ధికి ఉపయోగపడింది అంటే మనం మొదటి విజయం అందుకున్నట్లే.

ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి, అప్పుడే కోరుకున్నది దక్కుతుంది. విజయాన్ని చేరుకోవాలి అన్న సంకల్పం దృఢంగా ఉండాలి. మార్గంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు ఏర్పడుతాయి. అలాంటప్పుడు వాటిని ఎదుర్కుని పరిష్కరించడం ఒకటే కాదు వచ్చిన  సమస్యలు ఎందుకు? ఎలా వచ్చాయి? అవి రాకుండా వుండాలి అంటే మీరు ముందు గానే ఏమి చేయాలి అన్న విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకు అనుగుణంగా  మిమ్మల్ని మీరు మార్చు కోవాలి. గమ్యాన్ని చేరుకోవాలి అంటే మార్పు అవసరమే .

కానీ ఆ మార్పు మనకే కాదు మన తోటి వారికి కూడా మేలు చేసేది అయి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు ఈ క్షణం నుండే మీలో ఇంతకు ముందుకు ఇప్పటికి ఏ మార్పులు కలిగి ఉన్నారో, వాటి వలన మీకు నష్టమా? లాభమా? అన్న విషయాలను బేరీజు వేసుకుని వాటిని మీ విజయ సాధనకు ఎలా ఉపయోగించుకోవాలో సరి చూసుకోండి. ఇలా పైన తెలిపినవి అన్నీ సరిగా పాటించి ముందుకు వెళితే మీకు విజయం తప్పక సిద్ధిస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: