కావాల్సిన పదార్థాలు:
చికెన్ ఎముకలతో- అర కిలో
బియ్యం పిండి- రెండు స్పూన్లు
సెనగపిండి- మూడు స్పూన్లు
అల్లం వెల్లూలి పేస్టు- ఒక టీ స్పూన్
వేయించిన జీలకర్ర పొడి- అర టీ స్పూన్
కరివేపాకు తరుగు- రెండు స్పూన్లు
నిమ్మరసం- ఒక టేబుల్ స్పూన్
సాల్ట్- రుచికి సరిపడా
నూనె- డీ ఫ్రైకి సరిపడా
కారం- రెండు టేబుల్ స్పూన్స్
గరం మసాలా- ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను అరగంట పాటు ఉప్పు నీటిలో నానా బెట్టుకోవాలి. తర్వాత నీరు తీసేసి ఆ చికెన్ లో పైన చెప్పుకున్న అన్నీ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా మసాలా పట్టించిన ముక్కలని మూతపెట్టి కనీసం 4 గంటలు ఫ్రిజ్ లో నానా నివ్వండి. కుదిరితే రాత్రే ముక్కలకి మసాలా పట్టించి ఫ్రిజ్ లో నానానిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది.
ఇలా ముక్కలు బాగా నానిన తరువాత వేడి వేడి నూనె లో వేసి మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చే దాకా మీడియం–ఫ్లేం మీద మాత్రమే వేపుకోండి. ఎర్రగా వేగాక తీసి వేడి వేడిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి తో సర్వ్ చేసుకుంటే సరిపోతంది. అంతే వేడి వేడి చికెన్ పకోడి రెడీ..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి