ఆమె చ‌దువుకోవాల‌ని ఆశ‌క్తి క‌న‌బ‌రిచేవారికి ఓపుస్త‌క‌నేస్తం. తీర‌ని అశాంతితో ఇబ్బంది ప‌డేవారికి మ‌మ‌త‌ల పందిరి. ఏ ఆశ‌రా లేని అనాధ‌ల‌కు ఆప‌న్న హ‌స్తం. ఓ క‌న్నీటి సారిక‌.. ఓ ప‌ల్లెవారి వేద‌న..ఓదేవ‌దాసి గుండెకోత‌..ఓఅన్న‌దాత ఆక్రంద‌న‌..తుఫానులో చిక్కుకున్న అభాగ్యులు శ‌త్రుతూటాల‌కు ఎదురెళ్ళిన అమ‌ర‌వీరులు అంద‌రికీ ఆమె తోడు. ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా ముందుకొచ్చి వారి ప‌క్షాన నిలిచే సేవాస్ఫూర్తి. మ‌న‌సు బాధ‌ప‌డిన‌ప్పుడు అమ్మ కొంగులో త‌ల‌దాచుకున్నా..అలాంటి వేల‌మందిని అక్కున చేర్చుకుని అండ‌గా నిలిచి వారి జీవిత సుడిగుండాల‌నుంచి త‌ప్పిస్తున్న మాన‌వ‌తా వాది వ్య‌క్తిత్వ వికాశాన్ని న‌వ‌త‌రానికి అందిస్తోన్న ర‌చ‌యిత్రి ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్‌ఫోసిస్ ఛైర్మెన్ సుధామూర్తి.

 

సంప‌ద ఎంతున్న‌ది అన్న‌ది కాదు ఎంత ఆనందాన్ని పంచే మ‌న‌సున్న‌ది అన్న‌దే ముఖ్యం అనుఅనుకునే ఆవిడే ఇన్‌ఫోసిస్ నారాయ‌ణామూర్తి స‌తీమ‌ణి ప‌ద్మ‌శ్రీ సుధామూర్తి. అంద‌రూ న‌డిచిన దారిలో అడుగులు వేస్తే ఏ ఇబ్బందులు ఉండ‌వు. ప్ర‌యాణం ఎంతో సాఫీగా సాగిపోతుంది. కానీ కొంద‌రు భిన్నంగా ఆలోచిస్తారు. కొత్త దారిలో న‌డ‌వాల‌నుకుంటారు. స‌మ‌స్య‌లు ఉంటాయి. అవ‌మానాలు, అప‌జ‌యాలు ఎదుర‌వుతాయి. అయినా అన్నిటికీ సిద్ధ‌ప‌డ‌తారు. సుధామూర్తిది కూడా ఇలాంటి ఓ విభిన్న‌మైన మ‌న‌స్త‌త్వ‌మే. సుధామూర్తి ఉత్త‌ర‌క‌ర్నాట‌క‌లో షాగాన్‌లో జ‌న్మించారు. తండ్రి వైద్య నిపుణులు. త‌ల్లి విమ‌ల పెళ్ళికి ముందు కొంత కాలం టీచ‌ర్‌గా ప‌ని చేశారు. వీళ్ళు మొత్తం ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి.

 

వాళ్ళ‌లో రెండో అమ్మాయి సుధ‌. సంప్ర‌దాయ బ్రాహ్మ‌ణ కుటుంబం వీరిది. ఆచార‌వ్య‌వ‌హారాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌తనిచ్చేవారు. అయితేఅమ్మాయిల‌కి వానాకాలం చ‌దువులు ఉండాల‌న్న ఆలోచ‌న ఏమాత్రం వాళ్ళ త‌ల్లిదండ్రుల‌కు ఉండేది కాదు. ఈమెకు చిన్న‌ప్ప‌టి నుంచి కూడా సిపిమాలు చూడ‌టం అంటే చాలా ఇష్టం. ఇక ఈమె సినిమాలు చాలా బాగా చూస్తుంది. ఇప్ప‌టికీ ఆమెకు సినిమాల పై మ‌క్కువ ఎక్కువ‌. మిర్చి చిత్రంలో ప్ర‌భాస్‌, అనుష్క పాట కాటుక క‌ళ్ళ‌ణు చూస్తే పోతుందే మ‌తి పోతుందే అనే పాట అంటే ఆమెకు చాలా ఇష్ట‌మ‌ట‌. ప్ర‌భాస్‌మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌లోని పాట‌లు కూడా బావుంటాయ‌ని అలాగే కీర‌వాణి సాంగ్ అన్నా ఆమెకు చాలా ఇష్ట‌మ‌ట‌. ఇక ఇంత పెద్ద సేవామూర్తికి సెల్యూట్ అంటున్నారు చాలా మంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: