IHG

మీకు దండం పెడుతామీ సామి....మ‌మ్మ‌ల్ని మా భార్య‌ల నుంచి ర‌క్షించండి మ‌హప్ర‌భో..మేము వీరి టార్చ‌ర్ భ‌రించ‌లేక పోతున్నాం...మొగుళ్ల‌ను కూడా చూడాకుండా రోజూ చిత‌క‌బాదుతున్నారు..ఇదీ స్థూలంగా ఇటీవ‌ల త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిసామికి భార్య బాధితుల నుంచి వ‌చ్చిన లెట‌ర్‌లోని సారాంశం. ‘ఈ పెండ్లాలు పెడుతున్న బాధలు భరించలే కున్నాం.. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి రక్షించండి’ అని వేడుకున్నారు. భార్య‌లు త‌మ‌ను వేధిస్తున్నారు..శారీరకంగా హింసిస్తున్నా రని సిగ్గు విడిచి చెప్పుకుంటున్న త‌గిన ర‌క్ష‌ణ క‌రువ‌వుతోంది. వాస్త‌వానికి పెళ్లాం చేతిలో త‌న్నులు తిన‌డానికి సిగ్గు లేదా అంటూ హేళ‌న చేసేవారే త‌ప్పా...మ‌గ‌వారి బాధ‌ల‌ను ప‌ట్టించుకునే మ‌గ‌వాళ్లు బ‌హుత‌క్కువ‌నే చెప్పాలి. 

 

IHG


ఆడ‌దానికి ఆడ‌దే శ‌త్రువు అన్న ప‌దం బాగా పాపుల‌ర్ అయింది గాని....మ‌గ‌వాడికి మ‌గ‌వాడే శ‌త్రువు అన్న‌ది స‌త్య‌మే అయినా ఎందుక‌నో దానికంత పాపులారిటీ ద‌క్క‌లేదు. నిజంగా ద‌క్కి ఉంటే...ప్ర‌భుత్వాల నుంచి కొంత‌నైనా మగ‌వాళ్ల‌కు ఆడ‌వాళ్ల వేధింపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించి ఉండేద‌ని భార్య బాధితులు చెబుతున్నారు.  లాక్‌డౌన్ వల్ల ఇండ్లకే పరిమితమైన మొగుళ్లను కొట్టడంతో పాటు తిడుతున్నారని తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్‌తమిళన్ పేర్కొంటున్నారు. స‌మాజం స్త్రీప‌క్ష‌పాతి. అందుకే గృహ‌హింస‌కు పాల్ప‌డుతున్నారు అన‌గానే ఎలాంటి ఆధారాల్లేకున్నా అత్తామామ‌ల‌తో పాటు మొగుడు, ఆడ‌బిడ్డ‌ల‌పై కూడా నిర్ధాక్షిణ్యంగా కేసు న‌మోదుకు చ‌ట్టాలు ప‌ర్మిష‌న్ గ్రాంటెండ్ అంటుంటాయి.

 

IHG


మ‌హిళ‌ల‌కు ఎంతో ర‌క్ష‌ణ‌గా నిలిచిన‌..నిలుస్తున్న చ‌ట్టాలు..పురుష స‌మాజం విష‌యానికి వ‌చ్చేస‌రికి ప‌నిచేయ‌డం లేదు. భార్య త‌న‌ను హింసిస్తోంద‌ని పోలీస్‌స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లి సిగ్గువిడిచి కంప్ల‌యింట్ చేసే వాళ్లే త‌క్కువ‌గా ఉంటారు. అయినా అక్క‌డికి వెళ్లిన న్యాయం జ‌ర‌గ‌క‌పోగా అవ‌హేళ‌న‌లే మిగులుతున్నాయి.  భార్యా బాధితుల సంఘం అధ్య‌క్షుడు సీవీఎల్ న‌ర్సింహ‌రావు మాట్లాడుతూ కొత్తగా పెళ్లైనా తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎక్కువగా మగవారే ఉంటారని వ్యాఖ్య‌నించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల్లో అర్థం చేసుకున్న‌వారికి అర్థం చేసుకున్నంత అర్థం ఉంది. ఎప్ప‌టికైనా ఈ స‌మాజానికి మగాడికి అండ‌గా ఉండాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం..!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: