స్త్రీలు గర్భం దాల్చడం ఒక అదృష్టంగా భావిస్తారు. గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం మందుల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ.. వైద్య నిపుణులు ఇచ్చిన సలహా మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక వేళ ఏదైనా తేడా వస్తే కడుపులో బిడ్డ కాకుండా తల్లికి కూడా చాలా ప్రమాదకరం అనే చెప్పాలి. అంతేకాకుండా గర్భిణీలు వారు తీసుకునే ఆహారం మందుల విషయంలో నిత్యం జాగ్రత్త వహిస్తే తల్లిబిడ్డలు ఇద్దరు క్షేమము అనే చెప్పొచ్చు. కేవలం ఆహారం మందులు విషయంలో కాకుండా మరి కొన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. 

IHG


అవి ఏమిటి అన్న విషయానికి వస్తే... లిప్స్ స్టిక్, మాయిశ్చ‌రైజ‌ర్లు ఇంకా ఇతర సౌందర్య పదార్థాల విషయంలో జాగ్రత్తగా వహిస్తే చాలా మంచిదని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఏమిటి అంటే అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీకి చెందిన కొంతమంది ప్రముఖులు మేకప్ వేసుకునే గర్భిణీలను పరిశీలన చేయడం జరిగింది. 

IHG


గర్భందాల్చిన మహిళలు మేకప్ వేసుకోవడం వల్ల... కడుపులో ఉండే బిడ్డపై ఆ మేకప్ లో ఉండే కెమికల్స్ ప్రభావం పడుతుందని ప్రముఖులు తెలియజేస్తున్నారు. ఈ ప్రభావంతో పుట్టబోయే బిడ్డలకు చురుకుదనం ఉండకపోవటం.. అంతే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదట. ఇలా సమస్యలు వస్తాయని ఆ యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేయడం జరిగింది. అందుకోసమే గర్భిణీలు మేకప్ వేసుకోకుండా ఎంత దూరం ఉంటే అంతా తల్లి బిడ్డలకు మంచిది అని పరిశోధకులు హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి తల్లి కాబోతున్నవారు కాస్త మేకప్ జోలికి వెళ్ళకుంటేనే మంచిది సుమా ...! 

మరింత సమాచారం తెలుసుకోండి: