భారత రాజకీయాలను శాశించిన వ్యక్తుల్లో ప్రత్యేకంగా చెప్పుకునేది ఇందిరా గాంధీ రాజీవ్ గాంధి. ఇద్దరూ కూడా ప్రధానులుగా దేశ రాజకీయాలను శాసించడమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. జీవితంలో రాజీవ్ సాధించిన విజయాల్లో అమ్మ పాత్ర చాలా ఎక్కువ. కొడుకు చదువుకునే సమయంలో అతనికి రాజకీయాల మీద ఆసక్తిని గమనించిన ఇందిరా ఆ తర్వాత అతను పూర్తిగా చదువుకోవాలి అని చెప్పి రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంచింది. తాను ఎంత బిజీ గా ఉన్నా సరే కొడుకుని మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంచింది ఇందిర. 

 

అయితే కొడుకులో రాజకీయాలను రాణించే గుణాన్ని తన కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడే సమయంలో గమనించిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి చాలా జాగ్రత్తగా తీసుకుని రావాలని భావించారు. తల్లి మరణించిన సమయంలో రాజీవ్ ప్రధాని గా బాధ్యతలు చేపట్టినా సరే ఆయన చాలా కంగారు పడేవారు. కాని ఇందిర తో అత్యంత సన్నిహితంగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ లాంటి నాయకులు ఆయనను ముందు ఉండి నడిపించారు. తల్లి ప్రసంగాలను అతనికి వినిపించే వారు. ఆయన కూడా వాటిని చాలా జాగ్రత్తగా వినిపించే వారు. 

 

వాటిని విని తల్లి ప్రోత్సాహం తో ముందుకు పరోక్షంగా నడిచారు రాజీవ్. తల్లి ఉన్న సమయంలో రాజీవ్ చాలా వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కాని ఆమె కు సన్నిహితంగా ఉన్న కొందరు నాయకులు తల్లి తర్వాత రాజీవ్ ని ముందుకు తీసుకుని రావాలని అతని తో చర్చలు జరిపే వారు. ఆ విధంగా తన రాజకీయ జీవితాన్ని రాజీవ్ గాంధీ మొదలు పెట్టారు. ప్రతీ నిమిషంలో రాజీవ్ కి తన తల్లి ప్రోత్సాహమే చాలా అవసరం అయింది అని చెప్తూ ఉంటారు పరిశీలకులు. తల్లి మరణించిన తర్వాత అధికారం ఉన్నా అతను ఒంటరి తనం గడిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి: