కొంతమంది మహిళలు చూడడానికి  చాలా సన్నగా ఉంటారు.  అలా సన్నగా ఉన్న ఆడవాళ్లు బరువు పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గించుకోవడం ఎంత కష్టమో... సన్నగా ఉన్నవారు లావు కావడం అంతే కష్టం. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నా, మరీ సన్నాగా ఉన్నా మన ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది ఆడవాళ్లు బరువు పెరగాలని ఇష్టమొచ్చినట్లు తింటారు. కానీ వారు మాత్రం లావవ్వరు. లావు కావాలనుకునే వారు వాలా జీవన శైలిలో కొన్ని మార్పులు తీసుకోవాలి.



మీరు తీసుకోనే ఆహార పరిమాణాన్ని పెంచుకోండి. ఒక గుడ్డు, ఒక గుప్పెడు మెలకెత్తిన విత్తనాలు లేదా ఒక గ్లాసు పాలు, కొంచెం ఎక్కువ అన్నం మీ బరువును పెంచడానికి ఉపయెగపడతాయి. దీని జతకు ఒక అరటిపండు, సపోటా మెదలైనవి తీసుకోండి. అలాగే రోజు వారి ఆహారంలో వేరుసెనగ పప్పులు, బాదాం పప్పులు, జీడి పప్పులు మెదలైనని కూడా తీసుకోండి.గుర్తుంచుకోండి మీరు ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉండడం అనేది ముఖ్యం,అందుకని చింతించ మానండి.చాలామంది లావయ్యేందుకు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌లు తింటుంటారు. అయితే వీటి కారణంగా పొట్టలో క్రొవ్వు పేరుకుపోతుంది తప్ప లావు మాత్రం కారు. అంతేకాదు వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. మరికొంతమందైతే బరువును పెంచుకునేందుకు పౌడర్లు, మెడిసిన్లను వాడుతుంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటాయట. బరువు పెంచుకునేందుకు హెల్తీ డైట్ ఫాలో కావాలి.



బరువు పెరగాలనుకునే ఆడవాళ్లు ఎక్కువ క్యాలరీలను తీసుకోవాలి. అయితే శరీరానికి ఎక్కువ క్యాలరీని అందించే పదార్థాలు అరటిపండ్లు, పాలు, ఖర్జూరా పండ్లు, నెయ్యి, కిస్‌మిస్‌లు సరైన విధంగా తీసుకుంటే మంచిది. ఉదయం రెండు గ్లాసుల పాలు,ఆ తర్వాత రెండు అరటిపండ్లును తీసుకోవాలి అరటిపండులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి మిక్సీలో జ్యూస్‌లా వేసి తయారుచేసుకోవాలి.ఈ జ్యూస్‌ను ఉదయం తాగాలి.ఇలా క్యాలరీలను ఇచ్చేవాటిని తీసుకుంటే ఎనర్జీతో పాటు బరువు పెరగడానికి సహాయపడుతుంది.ఇలా చేస్తే మహిళల్లో నీరసం , అలసట తగ్గి ఆరోగ్యవంతగా ఉంటారు.. అలాగే బరువు కూడా పెరుగుతారు.. !!

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: