మేకప్: ప్రతిరోజూ రాత్రి నిద్ర పోయే ముందు తప్పనిసరిగా మేక్‌ప్ ను పూర్తిగా తీసేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దీంతో అడుగున ఉన్న తాజా చర్మం బయట పడుతూ అందంగా కనిపిస్తుందట .
సన్ స్ర్కీన్: కేవలం ఎండగా ఉన్నప్పుడే కాకుండా.. మబ్బు పట్టినా, వర్షం కురుస్తున్నా ముఖ చర్మానికి సన్ స్ర్కీన్ అప్లై చేయడంఆత్రం ఆపకూడదు. ఎంచుకునే సన్‌స్ర్కీన్ ఎస్‌పిఎఫ్ కనీసం 15కు తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడే సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మానికి రక్షణ దొరుకుతుంది.
పోషకాలు: తాజా కూరగాయలు, పండ్లు చర్మానికి చాలా పోషణ అందజేస్తాయి. అలాగే వేపుళ్లు, జంక్‌ఫుడ్, కూల్ డ్రింకులు చర్మానికి చాలా చేటు చేస్తాయి. కాబట్టి చర్మానికి మేలు చేసే పోషకాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.
వ్యాయామం: చర్మానికి రక్త ప్రసరణ సరిగ్గా ఉంటేనే నిగారింపు వస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. జాగింగ్, నడక, ఏరోబిక్స్, యోగా... మీకు నచ్చింది ఎంచుకుని క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.
నిద్ర: చర్మ సౌదర్యానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగా చాలకపోతే చర్మం నిర్జీవంగా మారిపోతుంది. కళ్ల కింద నల్లని వలయాలు వచ్చేస్తాయి. అందుకే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. అలాగే ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు.
నీళ్లు: రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారదు. గ్లాసు నీళ్లలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి తాగడం వల్ల పీహెచ్ లెవల్ నిలకడగా ఉండి, చర్మం నిగారిస్తుంది.
మొటిమలను గోళ్లతో గిల్లకూడదు. రోజు మొత్తంలో కనీసం మూడు సార్లు గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి