ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజానీకమంతా అతలాకుతలం అవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని సహాయక చర్యలు చేపట్టిన ఎన్ని రక్షణ చర్యలు చేపట్టిన కూడా ఈ మహమ్మారి అదుపు కాకపోవడంతో లాక్ డౌన్ ను పరిష్కారంగా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియలో ప్రజలు తక్కువ సమయంలోనే రోజంతా చేయవలసిన పనులు చేయాల్సి రావడంతో వారు ఎంతో మంది ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు మరెంతో మంది జీవనోపాధి కోల్పోయారు. భవిష్యత్తు ఏంటో తెలియక వారు కంగారు పడుతూ ఉంటే మరోవైపు ధరలు పెరగడం కూడా వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి.

అలా కరోనా కాలంలో భవిష్యత్ గందరగోళంగా మారిన వారిలో అంబికా బాలన్ ఒకరు. ఇన్నాళ్లు పాటే సర్వస్వంగా బ్రతికిన ఆమె బైక్ ట్యాక్సీ పై ఫుడ్ డెలివరీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. ఎంతో మంది లాగే ఈ మహమ్మారి తన జీవితంలో కూడా ఎన్నో మార్పులు తీసుకు వచ్చిందని ఆమె వాపోతున్నారు. పాటే ప్రాణంగా సర్వస్వంగా ఇన్నాళ్ళు బ్రతికాను. ఎన్నో సినిమాల్లో కోరస్ పాటలు పాడాను. ఎన్నో ఈవెంట్లో పాటలు పాడుతూ వచ్చాను. తెలుగు కాకుండా తమిళ మలయాళ హిందీ భాషల్లో ని పాటలు కూడా పాడగలను.

నా గాత్రం ద్వారా నేను పలురకాలుగా నెలకు పాతిక వేల దాకా సంపాదించుకునే దాన్ని. నేను, నా భర్త ఇద్దరు అమ్మాయిలతో నా జీవితం ఎంతో సంతోషంగా హాయిగా కొనసాగుతూ ఉండేది. నా భర్త సంపాదించినా నా సంపాదన వేడినీళ్లలో చన్నీళ్ల పనికొచ్చేది. కానీ గత సంవత్సరం నా భర్త చనిపోవడం కీలక పరిణామానికి దారి తీసింది. అప్పటివరకు సంతోషంగా సాగిన నా జీవితం తల్లకిందులు అయిపోయింది. కుటుంబ భారం అంతా నేనే మోయాల్సి వచ్చింది. హోటళ్లలో, పెళ్ళిలో పాటలు పాడుతూ కొంత డబ్బు సంపాదిస్తూ జీవితాన్ని సాగించిన నేను కరోనా వచ్చిన తర్వాత మరింత కష్టాలపాలు అయ్యాను. దాంతో నా పిల్లలను పోషించుకోవడానికి నేను ఈ బైక్ టాక్సీ ద్వారా ఫుడ్ డెలివరీ చేయడం మొదలుపెట్టాను.  బీకాం చదివిన నేను ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరు కనికరించలేదు. ఒంటరి ఆడదాన్ని అనే కరుణ కూడా చూపలేదు. అంటూ తన బాధలు చెబుతూ వాపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: