సాధారణంగా పిల్లలకు తల్లి పాలు పట్టించడం వలన చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. బిడ్డకి పాలివ్వడం బరువు తగ్గడంలో సహాయ పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇక బ్రెస్ట్ ఫీడింగ్ క్యాలరీలని కరిగించే గుణం అన్నారు. అంతేకాక.. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల గర్భ సంచి మళ్ళీ మామూలు సైహ్ లోకి వచ్చేస్తుందని తెలిపారు. కాగా.. బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకి డెలివరీ తరువాత తక్కువ బ్లడ్ లాస్ జరుగుతుందనీ, గర్భ సంచి త్వరగా ఇంతకు ముందున్న సైజ్ లోకి వస్తుందనీ నిపుణులు తెలిపారు.

అయితే ప్రసవానంతరం కొంత మంది స్త్రీలు డిప్రెషన్‌లోకి జారుకుంటూ ఉంటారు. ఇక దీన్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటున్నారు. కాగా.. బిడ్డకి పాలిచ్చే తల్లులు ఈ డిప్రెషన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తెలిపారు. అంతేకాక..  బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లులకి హైబీపీ, ఆర్థ్రరైటిస్, హై బ్లడ్ ఫ్యాట్స్, హార్ట్ డిసీజ్, టైప్ 2 డయాబెటీస్ వంటివి వచ్చే రిస్క్ బాగా తగ్గుతుందని చెప్పారు. ఇక బిడ్డకి పాలిస్తున్నప్పుడు వెంటనే పీరియడ్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందని అన్నారు. ఇక మీరు మీ బేబీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు అని అన్నారు.

ఇక బిడ్డకి పాలిచ్చేప్పుడు కొన్ని పొజిషన్స్ బాగా సహాయం పడతాయని చెబుతున్నారు. అయితే ఆ పొజిషన్స్ ఏమిటంటే ఒక్కసారి చూద్దామా. కాగా..  క్రాడిల్ హోల్డ్ పొజిషన్ అంటే బిడ్డ తలని మోచేతితో సపోర్ట్ చేస్తూ బిడ్డని తల్లి శరీరానికి దగ్గరగా హత్తుకుని ఉండటం. ఇలా తల్లి చేత్తో బిడ్డ బాడీని క్రాడిల్ చేయడం మంచిది. ఆలాగే క్రాడిల్ హోల్డ్ లో మీరు ఎటు వైపు నుండి పాలిస్తే ఆ మోచేత్తో బిడ్డ తలకి సపోర్ట్ ఇస్తుంటారు. ఇక ఇందులో మీరు ఎడమ వైపు నుండి పాలిస్తే బిడ్డ తలని కుడి అరచేత్తో సపోర్ట్ చేసి కుడి చేత్తో బిడ్డ బాడీనీ క్రాడిల్ చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: