సినీ ఇండస్ట్రీలో చాలామంది భార్య భర్తలు చిన్న చిన్న కారణాలతో  విడిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సమంత నాగ చైతన్య వివాహ బంధానికి స్వస్తి చెప్పిన వెంటనే, ఐశ్వర్య రజనీకాంత్ మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటూ అదే దారిలో నడిచారు. ఇలా ప్రముఖ నటీనటుల వివాహ బంధాలు మధ్యలోనే తెగిపోవడంతో చాలామంది రకరకాలుగా అనుకుంటున్నారు. మరి వీరు ఎందుకు విడిపోతున్నారో తెలియక అటు సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఐశ్వర్య ధనుష్ లు ఈ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా ఐశ్వర్య తమ పాత జీవితానికి స్వస్తి చెబుతున్నానని, విడిపోయిన రెండు నెలల తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లో ధనుష్ పేరును పూర్తిగా తొలగించినది.

ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఐడిని ఐశ్వర్య రజనీకాంత్ గా మార్చుకుంది. అయితే జనవరి 17వ తేదీన ధనుష్ మరియు ఐశ్వర్యాలు 18 సంవత్సరాల వివాహ బంధానికి విడిపోతున్నట్లు ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరి విషయంలో వారి కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకొని సయోధ్య కుదిర్చారు అని  ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటికీ  స్వస్తి పలుకుతూ ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. ఇద్దరు పిల్లల తల్లిదండ్రులైన వీరు ఈ విధంగా చేయడం చాలామందికి బాధాకరంగా అనిపించినా మాకు నచ్చింది మేము చేశామని వారు అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ధనుష్ సర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఐశ్వర్య మాత్రం ప్రముఖ దర్శకురాలిగా మంచి పేరు సంపాదించుకుంది. మరి వీరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లి అయిన 18 సంవత్సరాల తరువాత విడిపోతున్నారు. దీనికి సంబంధించిన కారణం అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: