భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఫిర్యాదులు వస్తే సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
 
మనం బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దేశ భద్రత, సున్నితమైన అంశాలపై పోస్టులు చేసేముందు జాగ్రత్త వహించాల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను వార్తలను మొదట నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఫేక్ పోస్టు, వీడియోలు పోస్ట్ చేయడం ఆ పోస్ట్ ల గురించి ప్రచారం చేయడం విషయంలో చర్యలు తప్పవని సమాచారం అందుతోంది.
 
ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా పోస్టులు చేస్తే మాత్రం మరిన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది. బాధ్యతతో వ్యవహరించాలని సోషల్ మీడియాను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసేవాళ్లపై కూడా కేసులు నమోదవుతున్నాయని భోగట్టా. ఇప్పటికే 8,000  ఖాతాలను నిలిపివేసినట్టు తెలుస్తోంది.
 
విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వ్యక్తుల ప్రొఫైల్స్ ను సైతం విశ్లేషించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ ఆర్మీ కదలికలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయొద్దని కోరారు. నిశ్శబ్దంగా, అప్రమత్తంగా, సానుకూలంగా ఉంటే మాత్రం సక్సెస్ మనదేనని దర్శకధీరుడు  రాజమౌళి చెప్పుకొచ్చారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: