ఇక లాంచ్ అయిన తర్వాత మోడల్‌తో కస్టమర్లు సంతృప్తి చెందకపోతే, టోకెన్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇస్తామని డీలర్లు వెల్లడించారు.ఇక జూన్ 18 న లాంచ్ అయిన తర్వాత ఎఫ్‌జెడ్-ఎక్స్ మోడల్ డెలివరీలు ఆగస్టు స్టార్టింగ్ లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇక రెట్రో లాంటి మోడల్ ధర సుమారు 1.04 లక్షల రూపాయలు. అంటే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 5,000 ఎక్కువగా వుంది.ఇక ఈ సరి కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ డిజైన్ విషయానికొస్తే, ఇది టియర్ ఐ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్‌తో లేటెస్ట్ రిట్రో డిజైన్ కలిగి ఉండటం విశేషం.
ఇక కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ రోడ్‌స్టెర్ డిజైన్ కారణంగా ట్యాంకుకు ఫెయిరింగ్ ఇంకా ట్రిమ్ లేదు. అయితే దానికి బదులు మధ్యలో బ్లాక్ అవుట్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది.ఈ కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. కాబట్టి దీనికి అనుకూలంగా ఉండే ఒక మంచి సీటింగ్ కూడా ఉంటుంది. ఇది విస్తృత హ్యాండిల్ బార్ అలాగే ఫుట్‌పెగ్ కలిగి ఉంది.ఇంకా ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.