సమ్మర్లో ఆ ఎండకి బయటకి పోతే సూర్యరశ్మి, వేడి ఇంకా ధూళి కారణంగా చర్మంలో మృతకణాలు పేరుకుపోయి చర్మం చాలా నిర్జీవంగా మారుతుంది. చర్మంలోని మురికిని శుభ్రం చేయడానికి చేసే మార్గాన్ని డిటాక్సిఫైయింగ్ అంటారు. ఆయుర్వేదంలో కూడా, శరీరం, చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి చాలా మార్గాలున్నాయి. లోపలి నుండి చర్మాన్ని శుభ్రం చేయడానికి మీరు కొన్ని ఆయుర్వేద ఆహారం ఇంకా మూలికల సహాయంని తీసుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.వేసవి కాలంలో చర్మాన్ని డిటాక్స్ చేసేందుకు నీళ్లే ఉత్తమ మార్గం. ఎందుకంటే ఇలా చేయడం వలనా చర్మంలో తేమతో పాటు మంచి నిగారింపు కూడా ఉంటుంది.. చర్మం బాగా మెరుస్తుంది. ఇంకా టానింగ్ అనేది ఏర్పడదు.అలాగే పసుపు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పూర్తిగా కలిగి ఉంది. ఇవి ఆరోగ్యానికి అలాగే చర్మానికి రెండింటికీ చాలా మేలు చేస్తాయి. శరీరం ఇంకా చర్మాన్ని నిర్విషీకరణ చేయడానికి మీరు ప్రతిరోజూ ఒక చిటికెడు పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి.లేదంటే పసుపు మాస్క్ కూడా వేసుకోవచ్చు.మన చర్మ నిర్విషీకరణలో కూడా వేప చాలా మంచిదని విదేశీ నిపుణులు కూడా భావిస్తున్నారు.


యాంటీ బాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి వేప తో చేసే వంటకం చర్మం నుండి విషాన్ని చాలా సులభంగా తొలగిస్తుంది. వీలైనప్పుడు వేప నీటిని ఖచ్చితంగా తాగండి. ఇంకా అంతేకాదు వేప ఆకుల పేస్ట్‌ను కూడా మీరు మీ చర్మానికి అప్లై చేయవచ్చు.అలాగే త్రిఫల చూర్ణం మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.ప్రతి రోజూ ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే కేవలం 15 రోజుల్లో ఆరోగ్యంతో పాటు చర్మంలో కూడా మీరు తేడాను గమనించవచ్చు.ఉసిరి ఏ సీజన్ లో నైనా చాలా మంచి ఆహారం.ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి సీజన్‌లో దీన్ని వినియోగించవచ్చు. ఉసిరిని తీసుకోవడం వలన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ఈజీగా పెంచవచ్చు. చర్మాన్ని మెరుగుపరచడానికి ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి కొల్లాజెన్ అనేది చాలా ముఖ్యం..కాబట్టి ప్రతి రోజూ పరిమిత పరిమాణంలో ఉసిరిని ఖచ్చితంగా తినండి. ఇంకా ఇది కాకుండా.. ఉసిరి మాస్క్ లేదా ఫేస్ ప్యాక్ ని కూడా మీరు అప్లై చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: