ఇక ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా జుట్టు రాలే సమస్యను బాగా ఎదుర్కొంటున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం వల్ల మనలో చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన ఇంకా వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అయితే జుట్టు రాలడానికి మరొ పెద్ద కారణం కూడా ఉంది.  అదే పోషకాహార లోపం. నేటి కాలంలో జంక్ ఫుడ్ ను ఇంకా బయట ఆహారాలను చాలా ఎక్కువగా తింటున్నారు. దీంతో మన శరీరానికి అలాగే జుట్టుకు కావల్సిన పోషకాలు సరిగ్గా అందడం లేదు.మన జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలు అందకపోవడం వల్ల కూడా జుట్టు చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అయితే పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ ఆహారాలను మనం తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా ఇంకా పొడవుగా పెంచే ఈ ఆహారాలు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కొబ్బరి మనకు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయి. కొబ్బరిని తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా ఇంకా నల్లగా పెరుగుతుంది. జుట్టు సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.


అలాగే జుట్టు సమస్యలతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో నువ్వులు కూడా ఒకటి.ఎందుకంటే నువ్వులల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు తెల్లబడడాన్ని కూడా ఈజీగా నిరోధిస్తాయి. పవర్ హౌస్ గా పిలిచే చియా విత్తనాలు  జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయి.వీటిలో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు చాలా ఉంటాయి. ఇవి జుట్టు పలుచబడడాన్ని ఈజీగా తగ్గించి జుట్టును ఒత్తుగా ఇంకా పొడువుగా పెరిగేలా ప్రేరేపిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో బాదంపప్పు కూడా మనకు చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో చాలా ఎక్కువగా ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో మెంతికూర ఇంకా మెంతి గింజలు కూడా ఒకటి.ఇవి జుట్టు రాలడాన్ని అలాగే జుట్టు దెబ్బతినడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: