తెలుగు ఇండస్ట్రీలో నటించిన చిత్రాలు తక్కువే కానీ.. పాపులారిటీ మాత్రం తెగ సంపాదించింది మాధవీ లత.  ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. తన విషయంలో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారని.. వారికి సరైన బుద్ది చెప్పానని ఇంటర్వ్యూలో చెప్పడంతో మాధవీ లత అందరి దృష్టిని ఆకర్షించింది.  ఆ తర్వాత శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున రగడ చేసిన విషయం తెలిసిందే.  అయితే ఎప్పటికప్పుడు తనదైన కాంట్రవర్సీ మాటలతో ఎప్పుడు హడావుడి చేస్తుంది మాధవీ లత.  ఆ మద్య బీజేపీ తీర్థం పుచ్చుకొని ప్రతిపక్ష హోదాలో అధికార పక్షంపై విరుచుకు పడింది. మొదటి నుంచి ఏ విషయం అయినా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మనస్థత్వం గల మాధవీ లత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 

కొత్త జీవితం ప్రారంభమైందని చెప్పింది. అద్భుతాలు జరిగాయని, అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని తాను నమ్ముతానని తెలిపింది. మరి ఈ అమ్మడు దేని గురించి మాట్లాడుతున్నదీ అన్న విషయం మాత్రం కాస్త సస్పెన్స్ గా ఉంది. అయితే మాధవీ లత మాత్రం  చాలా సంతోషంగా ఉన్నానని... ఏం జరిగిందో త్వరలోనే ప్రకటిస్తానని చెప్పింది. సోషల్ మీడియాలో మాధవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాధవీలత తన వివాహం గురించే ఈ విధంగా కామెంట్ చేసి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: